Ambati Rambabu: పవన్ పై అంబటి రాంబాబు సెటైర్లు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. పవన్ తన పార్టీని సీఎం అవ్వడానికి పెట్టలేదని, మరొకరిని సీఎం చేయడానికి పెట్టారని తమకు ఎప్పటినుంచో తెలుసంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళ నటుడు విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి ఒంటరిగా పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో, పవన్ కూడా అలాగే గెలవాల్సిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై […]

Published By: HashtagU Telugu Desk
Ambati Rambabu takes satirical digs at Pawan

Ambati Rambabu takes satirical digs at Pawan

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఘాటు విమర్శలు చేశారు. పవన్ తన పార్టీని సీఎం అవ్వడానికి పెట్టలేదని, మరొకరిని సీఎం చేయడానికి పెట్టారని తమకు ఎప్పటినుంచో తెలుసంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా అంబటి ఈ వ్యాఖ్యలు చేశారు.

తమిళ నటుడు విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి వచ్చి ఒంటరిగా పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో, పవన్ కూడా అలాగే గెలవాల్సిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై జనసేనాని స్పందించారు. విజయ్‌తో తనకు పోలిక లేదని, గతంలో తాను ఒంటరిగా రెండు చోట్ల పోటీ చేస్తే ప్రజలు ఓడించారని గుర్తుచేశారు. అందుకే పొత్తులతో వెళ్లాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

పవన్ చేసిన ఈ వ్యాఖ్యలనే అంబటి రాంబాబు ఆయుధంగా చేసుకున్నారు. “మీరు సీఎం కావాలని కాదు, ఎవరో సీఎం కావాలని పార్టీ పెట్టారని మాకు ఎప్పుడో తెలుసు. కానీ ఆ విషయం ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది” అని అంబటి వ్యాఖ్యానించారు. పవన్ స్వయంగా తన ఓటమిని, పొత్తుల అవసరాన్ని అంగీకరించడంతో, ఆయన రాజకీయ లక్ష్యంపై అంబటి పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం మొదలైంది.

  Last Updated: 16 May 2026, 12:34 PM IST