Site icon HashtagU Telugu

Chandrababu : కాసేపట్లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

Supreme Court

Chandrababu : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబుపై పెట్టిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని కోరుతూ సెప్టెంబరు మూడోవారంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ  సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై ఇవాళ వాదనలు విననుంది.  ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. తొలుత సెప్టెంబరు 26న ఈ పిటిషన్ ను విచారించాల్సి ఉండగా.. ఆ రోజున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో క్యురేటివ్ పిటిషన్‌లపై స్పెషల్ బెంచ్ సమావేశమైనందున, ఆ రోజున లిస్ట్ అయిన పిటిషన్ల విచారణ వాయిదా పడింది. అలా సెప్టెంబరు 27కు విచారణ వాయిదాపడిన  పిటిషన్ల లిస్టులో చంద్రబాబు పిటిషన్ కూడా ఉంది.

We’re now on WhatsApp. Click to Join

ఇక సెప్టెంబరు 27న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ వెళ్లిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో రెండో న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఉన్నారు. ఆయన ‘నాట్ బిఫోర్ మీ’ అని చెప్పడంతో.. పిటిషన్ ను మరో బెంచ్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కొన్ని రోజులు సెలవులు కూడా వచ్చాయి. దీంతో ఎట్టకేలకు ఈరోజు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో పెట్టేందుకు అవకాశం లేని కేసు ఇదని ఆయన తరఫు న్యాయవాదులు (Chandrababu) వాదించనున్నారు.

Also read : Mustard Seeds: చిటికెడు ఆవాలు.. బోలెడు లాభాలు.. ప్రయోజనాలు ఎన్నో తెలుసా..?