Religious Propaganda : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎంపీపీ స్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడి మతప్రచారాలు తీవ్ర వివాదానికి దారితీసాయి. ఈ సంఘటనలో, స్కూల్ హెడ్మాస్టర్ విద్యార్థులకు హిందూ దేవుళ్ళను కించపరిచేలా బోధనలు చేస్తున్నాడని, అంతేకాకుండా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు తెలిసిన తల్లిదండ్రులు , గ్రామస్థులు పాఠశాలకు చేరుకున్నారు, కానీ అప్పటికే హెడ్మాస్టర్ సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.
ప్రభుత్వ అటెండెన్స్, మిడ్ డే మిల్స్, ఇతర పుస్తకాలలో మతప్రచారాలకు సంబంధించిన వ్యాఖ్యలు రాస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. హిందూ దేవుళ్ళను తప్పుగా చిత్రీకరిస్తూ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాడని, మధ్యాహ్న భోజనం బాగా లేదని హెచ్‌ఏంకు చెప్పినా పిల్లలను కొడుతున్నాడని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, ఆడపిల్లలతో అసభ్యంగా మాట్లాడుతున్నాడని పిల్లల తల్లిదండ్రులు , విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయాలను తోటి ఉపాధ్యాయులు కూడా ధృవీకరిస్తున్నారు.
Vinod Kumar : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు బోయినపల్లి వినోద్ కుమార్ కౌంటర్
ఇంకా, పిల్లలకు కనీసం ఫ్యానులు కూడా అందకుండా చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యలను గ్రామస్థులు మండల విద్యాశాఖ అధికారికి తెలిపినప్పటికీ, అధికారులు ఏమీ చర్య తీసుకోవడం లేదని, ప్రధానోపాధ్యాయుడికి ఎంఈఓ సహకరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, గ్రామస్థులు హెడ్మాస్టర్‌ను హెచ్చరించినప్పటికీ, అతని ప్రవర్తనలో మార్పు రాలేదని వారు తెలిపారు.
ఈ సంఘటన పట్ల గ్రామస్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు మతపరమైన అంశాలు బోధించడం , ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలు హెడ్మాస్టర్‌పై ఉన్నాయి. ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుడి ప్రవర్తనను విచారించి, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
YS Jagan Tweet: కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ వైఎస్ జగన్ ట్వీట్