HBD CBN : మారిన సాయిరెడ్డి, అన్న‌య్య‌కు హ్వాపీ బ‌ర్త్ డే

టీడీపీ అధినేత చంద్ర‌బాబు(HBD CBN) మీద క‌సితీరా కామెంట్లు చేసే వాళ్ల‌లో

  • Written By:
  • Updated On - May 5, 2023 / 05:20 PM IST

టీడీపీ అధినేత చంద్ర‌బాబు(HBD CBN) మీద క‌సితీరా కామెంట్లు చేసే వాళ్ల‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి (Vijayasai Reddy) మొద‌టి వ‌రుస‌లో ఉంటారు. ఆయ‌న చేసే ట్వీట్లు చంద్ర‌బాబు మీద విషం క‌క్కేలా ఉండేవి. వ్య‌క్తిగ‌త, శారీరకంగా, మానసికంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా దాడి చేశారు. బ‌హుశా చంద్ర‌బాబునాయుడును ఆయ‌న 42ఏళ్ల రాజ‌కీయ చ‌రిత్ర‌లో సాయిరెడ్డిలా ఎవ‌రూ ప‌దునైన ప‌దాల‌తో టార్గెట్ చేసి ఉండ‌రు. అలాంటి విజ‌యసాయిరెడ్డికి క‌నువిప్పు క‌లిగింది.  అన్న‌య్య‌కు ఆప్యాయంగా బ‌ర్త్ డే విష‌స్ చెబుతూ ట్వీట్ చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

  అన్న‌య్య‌కు ఆప్యాయంగా బ‌ర్త్ డే విష‌స్(HBD CBN)

ప్ర‌తి ఏడాది పుట్టిన‌రోజు వేడుక‌లు చంద్ర‌బాబు(HBD CBN) చేసుకుంటారు. క్యాడ‌ర్ ఆయ‌న‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు చెబుతారు. సుదీర్ఘ రాజ‌కీయ జీవితంలో ఆయ‌న త‌యారు చేసిన లీడ‌ర్లు అనేకం. ప్ర‌స్తుతం రాష్ట్రాల‌కు సీఎంలుగా , మంత్రులుగా ఉన్నారు. ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ ఆయ‌న వ‌ద్ద ల‌బ్ది పొందిన వాళ్లు అసంఖ్యాకం. వాళ్లంద‌రూ చంద్ర‌బాబు 74వ ఏట అడుగుపెట్టిన చంద్ర‌బాబుకు బ‌ర్త్ డే విష‌స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడ‌ర్ కేక్ క‌ట్ చేసి త‌మ నాయ‌కుని పుట్టిన రోజు వేడుకులు జ‌రుపుకుంటున్నారు. పాద‌యాత్ర‌లో ఉన్న లోకేష్ తండ్రి చంద్ర‌బాబుకు బ‌ర్త్ డే విష‌స్ ట్వీట్ ద్వారా చెప్పారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు ఎన్ని ర‌కాలుగా బ‌ర్త్ డే విష‌స్ చెబుతున్న‌ప్ప‌టికీ వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి (Vijayasai Reddy) ట్వీట్ ముందు అన్నీ దిగ‌తుడుపే.

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్  

గ‌తంలో ఎప్పుడూ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఇలా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు(HBD CBN) చెప్పలేదు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చంద్రబాబుపై వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా, ఘాటు, ప‌రుష పదజాలంతో ట్వీట్ లు చేస్తుండేవారు.కానీ, ఈసారి మాత్రం చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా తొలి సారి విజయసాయి రెడ్డి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసిన ట్వీట్ త‌మ్ముళ్ల‌ను సంబ‌ర‌ప‌రుస్తోంది. ఆయ‌న చేసిన ట్వీట్ ఇలా ఉంది..“టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టిన రోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా” అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ రాజ‌ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం తప్పు కాదు కానీ, ఎన్నడూ లేని ఈ అలవాటు ఏంటని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తుండటం గమనార్హం. అటు తెలుగు త‌మ్ముళ్లు ఉబ్బిత‌బ్బిబ్బు అవుతూ రీ ట్వీట్లు చేస్తుంటే, వైసీపీ బ్యాచ్ మాత్రం ప‌లు ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

సాయి రెడ్డి ట్వీట్‌కు నెటిజన్ల నుండి భారీ స్పందన (HBD CBN)

ఇటీవల తారకరత్న మరణంతో విజయసాయిరెడ్డి కుటుంబం, నందమూరి కుటుంబం దగ్గరయ్యింది. అప్పటి నుండి చంద్రబాబుపై విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) విమర్శల ట్వీట్ల తీవ్ర‌త త‌గ్గింది. అంతేకాదు, చంద్ర‌బాబు మీద ఉన్న సోద‌ర ప్రేమ‌ను చూపుతూ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం నెటిజ‌న్ల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. “టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు సంపూర్ణ ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షుతో మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని వైఎస్సార్సీ నేత ట్వీట్ చేశారు. దానిలోని లోతుపాతుల‌ను రాజ‌కీయ పండితులు వెదుకుతున్నారు. సహజంగానే, సాయి రెడ్డి ట్వీట్‌కు నెటిజన్ల నుండి భారీ స్పందన వచ్చింది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ చంద్ర‌బాబుకు శుభాకాంక్షలు (HBD CBN) తెలియజేసేందుకు చాలా మంది మర్యాదపూర్వకంగా మెచ్చుకున్నారు.

నెటిజ‌న్ల కామెంట్లు కొన్ని..

“CBN ఎప్పుడూ ఫౌల్ లాంగ్వేజ్ ఉపయోగించదు సార్ – కానీ మీరు అతని గురించి (గతంలో) ట్వీట్ చేసిన విధానం చాలా చెడ్డది. కానీ తారక్ మరణం తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది. రాజకీయాలు అంటే వ్యతిరేకించుకోవాలి కానీ – ysrcp హద్దులు దాటి పోయింది. మీలో వచ్చిన ఈ మార్పుకు మీరు మా గౌరవాన్ని పొందుతున్నారు’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. “మీ నుండి ఈ ట్వీట్‌ను మేము ఎప్పుడూ ఊహించలేదు సార్” అని ఒక నెటిజన్ చెప్పగా, సాయి రెడ్డి మారిన వ్యక్తి అని మరొకరు అన్నారు. “మీరు ఎప్పుడూ ఇలాగే ఉండాలి సార్” అని మరో నెటిజన్ అన్నారు.

నిజానికి, 2021 ఏప్రిల్ 20న నాయుడు పుట్టినరోజున, సాయి రెడ్డి టీడీపీ అధినేతపై ఘాటైన మరియు అనుచిత వ్యాఖ్యలు చేశారు. “ఆంధ్రప్రదేశ్‌లోని తన కార్యాలయాలను మూసివేసినందున పొరుగు రాష్ట్రంలో తన పుట్టినరోజును జరుపుకుంటున్న 420 (ఏప్రిల్ 20)కి పుట్టినరోజు శుభాకాంక్షలు. అంతేకాకుండా, ఈ వ్యక్తి తన పార్టీ ప్రజలకు కరోనావైరస్ కారణంగా తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోవద్దని సందేశం ఇస్తాడు. “పార్టీ లేదు, బొక్క లేదు..” అనే సందేశాన్ని ఇప్పటికే మీ ప్రజలు అనుసరిస్తున్నారు. మిస్టర్ బాబూ, వారికి మళ్లీ మీ బ్రీఫింగ్ అవసరం లేదు! అంటూ సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Also Read : CBN : వైనాట్ పులివెందుల!క‌డ‌ప‌లో CBN 2డేస్ ఆప‌రేష‌న్

తాజాగా గురువారం 74వ చంద్ర‌బాబు బ‌ర్త్ డే(HBD CBN) సంద‌ర్భంగా చెప్పిన‌ శుభాకాంక్షలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. సాయి రెడ్డి (Vijaysai Reddy) రాజకీయంగా రూపాంతరం చెందిన వ్యక్తి అని స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇదే కాదు, రాజ్యసభ ప్యానల్ చైర్‌పర్సన్‌గా ఎదిగిన తర్వాత సాయి రెడ్డి సోషల్ మీడియాలో ఘాటైన వ్యాఖ్యలు చేయడం మానేశారు. రెండు నెలల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన నందమూరి తారకరత్న నివాసంలో చంద్ర‌బాబుతో స్నేహపూర్వకంగా మాట్లాడినప్పటి నుండి సాయిరెడ్డి వైఖ‌రి మారింది. ఆ రోజున తార‌క‌ర‌త్న‌కు నివాళులు అర్పించిన తర్వాత ఇద్దరూ కలిసి కూర్చుని కాసేపు ముచ్చ‌టించుకున్నారు. అక్క‌డ నుంచి చంద్ర‌బాబు వెళుతూ తన కారులో ఎక్కుతున్నప్పుడు సాయి రెడ్డి అనుస‌రించ‌డం కనిపించింది. స్వ‌ర్గీయ తారకరత్న ఇద్దరికీ బంధువు. అందుకే, ఇద్ద‌రూ క‌లిసిన‌ప్పుడు వ్యక్తిగతంగా ఏమీ లేదని, రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనని సాయిరెడ్డి సందేశం పంపారు. తాజాగా చంద్ర‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా చేసిన ట్వీట్ సాయి రెడ్డిని మారిన మ‌నిషిగా చూప‌డానికి ఉదాహరణగా నిలిచింది.

Also Read : CBN Selfy War : చంద్ర‌బాబు హైటెక్ వార్, జ‌గ‌న్ కు ఛాలెంజ్!