Site icon HashtagU Telugu

HBD CBN : చంద్ర‌బాబు బ‌ర్త్ డే వేడుకలు, వేదిక‌పై `ఐడియాల‌జీ` కాన్సెప్ట్

HBD CBN

Chandra Babu Naidu 74th Birthday Celebration

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 74వ బ‌ర్త్ డే వేడుక‌లు (HBD CBN) ప్ర‌కాశం జిల్లా మార్కాపురంలో (Markapuram) జ‌రిగాయి. వినూత్నంగా మ‌హిళ‌తో ఆత్మీయ స‌మ్మేళనం నిర్వ‌హించారు. `ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..` కార్య‌క్ర‌మంలో భాగంగా క‌డ‌ప నుంచి ప్ర‌కాశం జిల్లా మార్కాపురంకు గురువారం చేరుకున్నారు. అక్క‌డ క్యాడ‌ర్ నిర్వ‌హించిన బ‌ర్త్ డే వేడుక‌ల్లో చంద్ర‌బాబు పాల్గొన్నారు. చిన్నారుల‌తో వేడుక‌ల‌ను పంచుకున్నారు. వేడుక‌ల్లో పాల్గొన్న వాళ్ల‌కు స్వ‌యంగా చంద్ర‌బాబు భోజ‌నం వడ్డించారు.

చంద్ర‌బాబునాయుడు 74వ బ‌ర్త్ డే వేడుక‌లు (HBD CBN)

రెండు రోజుల క్రితం క‌డ‌ప‌కు వెళ్లిన చంద్ర‌బాబు క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం జిల్లా స‌మీక్ష‌ల‌ను జ‌రిపారు. ఆ జిల్లాల్లోని పార్ల‌మెంట్‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ఇంచార్జిల‌తో స‌మీక్ష జ‌రిపారు. వైనాట్ పులివెందుల దిశ‌గా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. క‌డ‌ప ద‌ర్గాకు వెళ్లిన ఆయ‌న ముస్లిం పెద్ద‌ల‌తో క‌లిసి ప్రార్థ‌న‌లు చేశారు. స‌మీక్షలు ముగిసిన త‌రువాత గురువారం ప్ర‌కాశం జిల్లా మార్కాపురం (Markapuram) చేరుకున్నారు. ఇటీవ‌ల అక్క‌డ‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వెళ్లారు. వెలిగొండ ప్రాజెక్టును త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆయ‌న వెళ్లిచ్చిన వారంకు చంద్ర‌బాబు అదే ప్లేస్ కు వెళ్లారు. అక్క‌డ ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి..కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున మ‌హిళ‌లు త‌ర‌లిరావ‌డం ఈ ప్రోగ్రామ్ లోని హైలెట్‌.

చిన్నారులతో కలిసి చంద్రబాబు బ‌ర్త్ డే కేక్ క‌ట్

సాధార‌ణంగా ఎక్క‌డ‌కు వెళ్లినా చంద్ర‌బాబు (HBD CBN) ప్ర‌త్య‌కంగా త‌యారు చేసిన బ‌స్సులోనే బ‌స చేస్తారు. దానిలోనే కాల‌కృత్యాలు, యోగా, కోర్ క‌మిటీ మీటింగ్ లు నిర్వ‌హిస్తారు. ఉద‌యం 5 గంట‌ల నుంచి ఆయ‌న దైనందిన అపాయింట్మెంట్ల‌ను ఇస్తారు. రోజు కంటే గురువారం పెద్ద ఎత్తున ఉద‌యం (Markapuram) బ‌స్సు వ‌ద్ద‌కు జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. బ‌ర్త్ డే సంద‌ర్భంగా చంద్ర‌బాబును క‌లిసి విషెస్ చెప్ప‌డానికి పోటీ ప‌డ్డారు. పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన ప్ర‌జలు, పార్టీ నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీప‌డ్డారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులతో కలిసి చంద్రబాబు బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేయ‌డం ఈసారి వేడుక‌ల్లోని విశేషం.

Also Read : HBD CBN : మారిన సాయిరెడ్డి, అన్న‌య్య‌కు హ్వాపీ బ‌ర్త్ డే

చిన్నారులు టీడీపీ అధినేతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య మహిళలు, చిన్నారులతో కలిసి చంద్రబాబు నాయుడు బ‌ర్త్ డే వేడుకులు (HBD CBN) చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్క‌డికి వ‌చ్చిన ప్ర‌జ‌ల‌కు స్వ‌యంగా చంద్ర‌బాబు భోజనాలు వడ్డించారు. ఆప్యాయ‌త‌ను పంచుకున్నారు. పుట్టిన రోజు సంద‌ర్భంగా మహిళలతో ఆత్మీయ సదస్సు జ‌రిగింది. ఆ వేదికపై ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి మ‌హిళ‌లు జ‌రిపిన వేడుక‌లో పాల్గొన్నారు. టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. మహిళలతో ఆత్మీయ సమావేశ వేదికపై ఐడియాలజీ కాన్సెప్ట్ నోట్ ను సామాన్య మహిళలు, చిన్నారులతో కలిసి చంద్రబాబు నాయుడు విడుదల చేయ‌డం ఆయ‌న విజ‌న్ ను గుర్తు చేస్తోంది.

Also Read : CBN : వైనాట్ పులివెందుల!క‌డ‌ప‌లో CBN 2డేస్ ఆప‌రేష‌న్