Vijayamma- Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్నటి నుంచి కడప జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఆ ఫొటోలో తన తల్లి విజయమ్మ, షర్మిల కొడుకు- కోడలు కూడా ఉండటం విశేషం.
ఇక అసలు విషయానికొస్తే.. ముందస్తు క్రిస్మస్ వేడుకలలో భాగంగా జగన్ కుటుంబ సభ్యులు (Vijayamma- Jagan) ఇడుపులపాయలో మంగళవారం సంబరాలు చేసుకున్నారు. కొన్ని రోజులుగా జగన్ తన తల్లి విజయమ్మకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా జగన్‌తో.. విజయమ్మ, షర్మిల కొడుకు కోడలు ఒకే చోట కలవడం జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల మాత్రం ఈ వేడుకలకు దూరంగా ఉన్నారు.
Also Read: Christmas Celebrations: మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. సీఎం రేవంత్ కూడా!
గత కొద్ది రోజులుగా జగన్ కుటుంబంతో ఆస్తి తగాదాలతో తల్లి విజయమ్మ దూరంగా ఉన్న విషయం మనకు విధితమే. క్రిస్మస్ వేడుకల్లో జగన్ తో పాటు పాల్గొనడంతో జిల్లాలో పెద్ద చర్చే నడుస్తుంది. అలాగే ఈ వేడుకలలో షర్మిల కొడుకు కోడలుతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫొటో కూడా దిగారు. దీంతో నెటిజన్లు వైయస్ విజయమ్మ- జగన్‌కి మధ్య ఉన్న కుటుంబ తగాదాలు ఓ కొలిక్కి వచ్చాయా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మాజీ సీఎం జగన్
కడప జిల్లా పులివెందులలోని CSI చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా వైసీసీ అధినేత జగన్‌తో సహా ఆయన కుటుంబ సభ్యులు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలోని ప్రజలు అందరూ శాంతియుతంగా జీవించాలని కోరుకున్నట్లు జగన్ చెప్పారు. ఆయన పర్యటనలో భాగంగా గురువారం జగన్ నివాసంలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.