AP : మీ వైఖరి ఏంటో చెప్పాలంటూ పవన్ కు హరిరామ జోగయ్య సంచలన లేఖ

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 03:04 PM IST

కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య (Harirama Jogaiah )..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు లేఖ ( Sensational Letter ) రాసారు. ” మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల గురించి ఆలోచించారా..? అంటూ ప్రశ్నించారు.

జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్..గత పదేళ్లుగా కష్టపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలని అభిమానులు , జనసేన కార్య కర్తలు , నేతలు ఎదురుచూస్తున్నారు. మొదటిసారి టీడీపీ కి సపోర్ట్ చేసిన పవన్..ఆ తర్వాత దూరమయ్యారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సింగిల్ స్థానం మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత ఆ ఒక్క స్థానం కూడా వైసీపీ లో కలిసింది. అయితే ఈసారి జనసేన ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం ఖాయమని..పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం గ్యారెంటీ అని అభిమానులు , కార్యకర్తలు బలంగా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు పవన్ సీఎం స్థానంలో నేను నిలబడడం లేదని , చంద్రబాబు ను సీఎం చేద్దామని చెప్పడం..లోకేష్ సైతం ఈసారి బాబే సీఎం అని మీడియా ఛానల్ ఇంటర్వూస్ లలో చెప్పడం..జనసేన కార్యకర్తలు , అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ ను సీఎం గా చూడాలనే కల ‘కల’గానే మిగిలిపోతుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ ప్రవర్తన ఏంటో అర్ధం కావడం లేదని..కాసేపు నేనే సీఎం బరిలో ఉన్నానని , మరికాసేపు చంద్రబాబు ఉన్నారని ఇలా రెండు రకాలుగా మాట్లాడడం అందర్నీ అయోమయంలో పడేస్తుంది. తాజాగా ఇదే అంశాన్ని హరిరామజోగయ్య లేఖలో ప్రస్తావించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ లేఖలో ఏమి రాసారంటే.. ” మీరే ముఖ్యమంత్రి కావాలని, అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీనవర్గాలు శాసించే స్థితికి రావాలని కలలు కంటున్న జన సైనికుల గురించి ఆలోచించారా..?ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి రెండే రెండు కుల నాయకులు రాజ్యమేలుతున్నారన్నారు. 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఇంకెప్పుడు మోక్షం వస్తుందని అన్నారు. నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏమిటి? వీటన్నింటికి మీరు సమాధానం చెప్పాలి.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులందరికి అర్ధమయ్యేలా చెప్పాల్సిందిగా కోరుచున్నాము” అంటూ లేఖలో పేర్కొన్నారు. మరి దీనికి పవన్ ఏ సమాధానం చెపుతారో చూడాలి. ఏది ఏమైనప్పటికి టీడీపీ తో పవన్ కలవడం..సీఎం స్థానంలో నేను లేను అని చెప్పడం జనసేన కార్యకర్తలు , అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Read Also : Praja Bhavan : చలిలో కూడా ప్రజాభవన్ వద్ద బారులు తీరిన జనం