జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు రోజు రోజుకు ప్రముఖల నుండి మద్దతు పెరుగుతుంది. ఇప్పటీకే క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) మద్దతు తెలపడమే కాదు ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనగా..తాజాగా మరో ఇండియన్ క్రికెటర్ హనుమ విహారి (Hanuma Vihari) జనసేన కు మద్దతు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా.. ట్వీట్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
‘ధర్మం గెలవాలి.. చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలిపించండి’ అంటూ హ్యాష్ ట్యాగ్ పిఠాపురం అంటూ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి హనుమ విహారి ట్వీట్ చేశారు. అలాగే ఇన్‌స్టా్గ్రామ్‌లో కూడా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా శుక్రవారం వీడియో పోస్ట్ చేశారు. అయితే గతంలో ఓ వివాదం సమయంలో హనుమ విహారికి పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలిచారు. జనసేన పార్టీ, టీడీపీ కూడా హనుమ విహారికి మద్దతుగా నిలిచింది. దీంతో ఎన్నికల సమయంలో జనసేనకు మద్దతుగా హనుమ విహారి ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక చిత్రసీమ నుండి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. జబర్దస్త్ టీం సభ్యులు , పలువురు సినీ హీరోలు , దర్శకులు , నిర్మాతలు ఇలా యావత్ సినీ ఇండస్ట్రీ పవన్ కు మద్దతు తెలిపి జనసేన శ్రేణుల్లో ఆనందం నింపారు.
Dharmam gelavali.. History lo Epudu lenu majority tho gelipinchandi.#Pitapuram
— Hanuma vihari (@Hanumavihari) May 11, 2024
Read Also : Jagan : పిఠాపురం ప్రజలకు కీలక హామీ ఇచ్చిన జగన్