AP : నిధులు ఇవ్వకుండా నియోజకవర్గం డెవలప్ చేయమంటే ఎలా..? – జగన్ ఫై జయరాం ఫైర్

ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram Resigned to YCP) ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటిచారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ […]

Published By: HashtagU Telugu Desk
Jayaram Tdp

Jayaram Tdp

ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి మరో షాక్ తగిలింది. గత కొంతకాలంగా సీఎం జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మంత్రి గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram Resigned to YCP) ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటిచారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈరోజు గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ (Jayaho BC) ‘ సభలో చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్‌ విధానాలతో విసుగుచెంది పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో గుంతకల్లు నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా జగన్ ఫై జయరాం నిప్పులు చెరిగారు. నియోజకవర్గానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా డెవలప్ చేయలేదని చెప్పి టికెట్ ఇవ్వకపోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్‌ తనను అడిగారని..కానీ తనకు అది ఇష్టం లేదని అన్నారు. ‘‘సీఎం జగన్ నా.. నా.. అంటున్నారు.. కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీసీలకు న్యాయం జరగలేదన్నారు. ఓ బోయను.. ఓ ఎస్సీ.. ఓ ముస్లింలను తీసేశారు. 2022 తర్వాత జగన్ను ఓ దేవుడిగానే చూశాను. 2022. తర్వాత జగన్ విగ్రహంగా మారారు. ఆ విగ్రహానికి సజ్జల, ధనుంజయ్ రెడ్డిలు పూజారులు. పూజారులు వాళ్ల కొడుకులకే న్యాయం చేస్తున్నారు కానీ.. భక్తులకు న్యాయం చేయడం లేదు’’ అని గుమ్మనూరి జయరాం పేర్కొన్నారు. తన మాటే శాసనం, తన నిర్ణయమే ఫైనల్ అనే మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారని… కష్టకాలంలో తనతో నడిచిన వారికి సైతం మెుండి చేయి చూపిస్తున్నారని జయరాం మండిపడ్డారు. 12 ఏళ్ల నుంచి వైసీపీ జెండా మోశానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని.. మంత్రి పదవి చేశానన్నారు. ఆలూరు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైసీపీని వీడుతున్నానన్నారు.

Read Also ; Kaleshwaram : కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ కోట్ల రూపాయలు దోచుకుంది – ప్రధాని మోడీ

  Last Updated: 05 Mar 2024, 01:30 PM IST