Gummanur Jayaram : మంత్రివర్గం నుంచి గుమ్మనూరు జయరామ్ బర్తరఫ్

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 09:30 PM IST

టీడీపీ లో చేరిన మంత్రి గుమ్మనూరు జయరామ్ (Gummanur Jayaram) ను బర్తరఫ్ ( Bartaraf) చేశారు. సీఎం జగన్ సిఫార్సు మేరకు కేబినెట్ నుంచి జయరామ్ ను తప్పిస్తూ గవర్నర్ అబ్దుల్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నుంచి వరుసపెట్టి నేతలు బయటకు వస్తూ.. టీడీపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు , ఎమ్మెల్సీ లు చేరగా.. తాజాగా వైసీపీ కీలక నేత, మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram ).. సీఎం జగన్‌కు(CM YS Jagan) బిగ్ షాక్ ఇచ్చారు. అమరావతిలో టీడీపీ(TDP), జనసేన(Janasena) సంయుక్తంగా నిర్వహించిన బీసీ జయహో సదస్సు లో టీడీపీ లో చేరారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బీసీల సంక్షేమం కోసం టీడీపీ పార్టీ పనిచేస్తుందని, పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేశారు. వైసీపీకీ, మంత్రి పదవికీ రాజీనామా చేస్తున్నట్లు మధ్యాహ్నం ప్రకటించిన గుమ్మనూరు జయరాం.. సాయంత్రం టీడీపీలో చేరిపోవడంతో వెంటనే ఆయనపై ఏదో ఒక చర్య తీసుకోవాల్సిన పరిస్దితి ఎదురైంది. దీంతో సీఎం జగన్ ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు సమాచారం పంపించారు. దీంతో సీఎం జగన్ నిర్ణయానికి ఆమోదముద్ర వేస్తూ గవర్నర్ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో జయరాం మాజీ మంత్రి అయ్యారు. ఉదయం జయరాం మీడియా తో మాట్లాడుతూ..”కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్‌ అడిగారు. నాకు ఇష్టం లేదు. టీడీపీ తరఫున గుంతకల్లు నుంచి పోటీ చేస్తా. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్‌ తయారయ్యారు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారు” అని ఆరోపించారు.

Read Also : Facebook Down: ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ స‌ర్వీసులు డౌన్‌.. కార‌ణ‌మిదేనా..?