Site icon HashtagU Telugu

Talliki Vandanam : తల్లికి వందనం పథకానికి మార్గదర్శకాలు

guidelines-for-talliki-vandanam-scheme

talliki-vandanam-scheme

Talliki Vandanam Scheme: ఏపి ప్రభుత్వం(AP Govt)లోని టీడీపీ కూటమి(TDP alliance) సూపర్‌ సిక్స్‌లో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో తల్లికి వందనం పథకాని పొందపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకానికి హాజరు నిబంధనను విధించింది. బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం కింద రూ.15 వేల ఆర్థికసాయం ఏపి సర్కార్‌ అదించనుంది. దారిద్య్రయ రేఖ దిగువ (బిపిఎల్‌) ఉన్న వారికి ఈ పథకం అమలవుతుందని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ జిఓ 29ను విడుదల చేశారు. 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు ఈ పథకం కింద రూ.15 వేలు అందిస్తామని పేర్కొన్నారు. ఇది పొందాలంటే విద్యార్థి హాజరు 75 శాతం ఉండాలనే షరతు విధించారు. అదే విధంగా ఆధార్‌ కార్డు అనుసంధానం చేయాలని, అందువల్ల ఆధార్‌ను ఎన్‌రోల్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకు, లేదా పోస్టాఫీస్‌ పాస్‌బుక్‌, పాన్‌, పాస్‌పోర్ట్‌, రేషన్‌ కార్డు, ఓటర్‌ కార్డు, ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కార్డు, కిసాన్‌ ఫొటో పాస్‌బుక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, గెజిటెడ్‌ ఆఫీసర్‌ లేదా తహశీల్దార్‌ ఇచ్చిన గుర్తింపు పత్రం, ఇతర శాఖలు ఇచ్చిన పత్రాలతో ఎన్‌రోల్‌ చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే స్టూడెంట్‌ కిట్‌కు కూడా ఆధార్‌ ఉండాలని పేర్కొన్నారు. స్టూడెంట్‌ కిట్‌ కింద ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకు బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్‌ బుక్‌లు, ఆంగ్ల డిక్షనరీ, మూడు జతల యూనిఫామ్, బెల్టు, జత బూట్లు, రెండు జతల సాక్సులు అందజేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, గత జగన్ సర్కార్‌ హయాంలో అమ్మఒడి పేరుతో ఏడాదికి రూ.15వేల చొప్పున విద్యార్థులకు సాయం అందించింది. మొదటి ఏడాది కరోనా సమయంలో అమ్మఒడి పథకం కింద 2020 జనవరి 9వ తేదీన డబ్బుల్ని విడుదల చేసింది. 2021 జనవరి 9వ తేదీన రెండో ఏడాది కూడా అమ్మఒడి పథకం నిధుల్ని తల్లుల అకౌంట్‌లలో జమ చేశారు. ఆ తర్వాత స్కూళ్లలో విద్యార్థుల హాజరు శాతాన్ని, విద్యా ప్రమాణాలు పెంచేందుకు 75 శాతం హాజరు ఉండాలని తెలిపింది. 2022 జూన్‌ 27వ తేదీ, 2023 జూన్‌ 28 తేదీన అమ్మ ఒడి నిధులు తల్లుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేశారు. ఈ ఏడాది కూడా జూన్‌ చివరిలో అమ్మఒడి నిధులు జమ చేయాల్సి ఉంది.. ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో ఈ పథకానికి తల్లికి వందనం పేరు మార్చారు.. త్వరలోనే అమలు చేయాలని భావిస్తున్నారు.

Read Also: YouTuber Praneeth : యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్