YCP MLA Joins BJP : వైసీపీ కి భారీ షాక్..బిజెపిలో చేరిన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వరప్రసాద్..ఈసారి వరప్రసాద్‌కు వైసీపీ టికెట్ నిరాకరించడం తో..ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని భావించిన వరప్రసాద్..ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా బీజేపీలోకి చేరారు.

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 12:48 PM IST

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి షాకులు తప్పడం లేదు. ఇప్పటికే అనేక మంది పార్టీ ని వీడగా…తాజాగా మరో ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ (Gudur YCP MLA Varaprasad Rao)..ఈరోజు ఢిల్లీ లో బిజెపి (BJP) కండువా కప్పుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వరప్రసాద్..ఈసారి వరప్రసాద్‌కు వైసీపీ టికెట్ నిరాకరించడం తో..ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని భావించిన వరప్రసాద్..ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా బీజేపీలోకి చేరారు. కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ సంకాశంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు వరప్రసాద్ ఆసక్తి ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి బిజెపి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిన్న జరిగిన సిఈసి (CEC) సమావేశంలో ఏపీ (AP)లో 6 ఎంపీ స్థానాలు , 10 అసెంబ్లీ స్థానాలను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. ఆదివారం సాయంత్రం పార్ఠీ తరఫున పోటీ చేసి ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది.

We’re now on WhatsApp. Click to Join.

నరసాపురం- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజమండ్రి- ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అనకాపల్లి- రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాజంపేట లోక్‌సభ స్థానానికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి- వరప్రసాద్ లేదా కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ, అరకు- మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. రత్నప్రభ గతంలో కూడా బీజేపీ తరఫున తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసిన విషయం తెలిసిందే.

Read Also : Shruthi Hassan : డైరెక్టర్ తో రొమాన్స్ కోసం హీరోయిన్ బలవంతం..!