Site icon HashtagU Telugu

Gudlavalleru Engineering College : నిందితులను కాపాడే శక్తి ఎవరు?

Gudlavalleru Engineering Co

Gudlavalleru Engineering Co

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజ్ (SR Gudlavalleru Engineering College) లో అమ్మాయిల హాస్టల్ (Girls Hostel) బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు (Secret Camera in Bathroom) ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటన కు పాల్పడిన వారిపై కఠిన శిక్ష విధించాలని విద్యార్థి సంఘాలు , తల్లిదండ్రులు , విద్యార్థులు డిమాండ్ చేస్తూ..ఆందోళన చేపట్టారు. విద్యార్థి సంఘాల ఆందోళనలతో కాలేజీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొండడంతో కాలేజీకి యాజమాన్యం సెలవులు ప్రకటించింది. అయితే ఓ పక్క విద్యార్థులు ఆందోళనలు చేస్తుండగా..హిడెన్ కెమెరాలను అమర్చిన నిందితురాలిని రహస్యంగా పోలీసులు కాలేజీ నుండి ఇంటికి తరలించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఘటనకు సంబంధించి నిందితులను కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా..? హిడెన్ కెమెరాలను అమర్చిన నిందితురాలిని సేఫ్ జోన్ లో చేర్చరా..? ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఆమెను ఇంటికి చేర్చారా..? హాస్టల్ నుంచి ఏదో గొప్ప పని చేసినట్లు రాచ మర్యాదలతో కారులో ఆమెను ఎందుకు తరలించినట్లు..? ఇదంతా ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతోనే జరిగిందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది.

ఇదే కాలేజీలో ఫైనలియర్ బిటెక్ చదువుతున్న ఓ విద్యార్థి బాత్‌రూమ్‌లలో కెమెరాలు పెట్టినట్టు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అతనికి ఓ విద్యార్థిని సహకరించినట్టు , వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించే ప్రయత్నం జరుగుతోందని స్టూడెంట్స్ అంటున్నారు. రహస్య చిత్రీకరణ చేసిన విద్యార్థి ఓ రాజకీయ పార్టీ నాయకుడి తనయుడు కావడంతో వారం రోజుల క్రితమే విషయం వెలుగు చూసినా యాజమాన్యం చూసిచూడనట్టు వదిలేసిందని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు, విద్యార్థుల ఆందోళనలను ఎక్స్‌లో వైరల్‌గా మారాయి. ఇక 300 పైగా వీడియోలను చిత్రీకరించారని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక విద్యార్థిని సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంత మంది ఫైనలియర్‌ బిటెక్ విద్యార్థులు ఈ దారుణానికి పాల్పడినట్లుగా విద్యార్థినులు చెపుతున్నారు. ఈ ఘటన ఫై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నట్లు మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. రహస్య కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించినట్టు ప్రకటించారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవన్నారు.‌

Read Also : Rains : నడుము లోతు నీళ్లల్లో..ప్రజల బాగోగులు అడిగితెలుసుకున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్