AP : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత

MLA Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుడివాడ(Gudivada)లోని తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకుల, కార్యకర్తలతో మాట్లాడుతూ..అకస్మాత్తుగా సోఫోలో కుప్పకూలిపోయినట్లు సమాచారం. కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై సపర్యలు చేశారు. గన్‌మెన్లు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కొడాలి నాని నివాసానికి వచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పార్టీ నాయకులందరినీ ఇంట్లో నుండి పంపించివేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నానికి సెలెన్‌ ఎక్కిస్తున్నట్లు తెలుస్తుంది. We’re now […]

Published By: HashtagU Telugu Desk
Gudivada MLA Kodali is unwell

Gudivada MLA Kodali is unwell

MLA Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరావు(నాని) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గుడివాడ(Gudivada)లోని తన స్వగృహంలో నందివాడ మండల వైసీపీ నాయకుల, కార్యకర్తలతో మాట్లాడుతూ..అకస్మాత్తుగా సోఫోలో కుప్పకూలిపోయినట్లు సమాచారం. కార్యకర్తలు వెంటనే అప్రమత్తమై సపర్యలు చేశారు. గన్‌మెన్లు వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు కొడాలి నాని నివాసానికి వచ్చి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పార్టీ నాయకులందరినీ ఇంట్లో నుండి పంపించివేశారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం, కొడాలి నానికి సెలెన్‌ ఎక్కిస్తున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

మరోవైపు కొడాలి నాని అస్వస్థతకు గురైనట్లు వార్తలు తెలుసుకొన కుటంబసభ్యులు, కార్యకర్తలు ఆందోనళకు గురవుతున్నారు. కొడాలి నాని కుటుంబసభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌ నుండి గుడివాడ బయలుదేరారు.

Read Also: Malavika Mohanan : రాజా సాబ్ బ్యూటీ అందాలతో రఫ్ఫాడించేస్తుంది..!

కాగా, సుమారు 75 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కొడాలి నాని బిజీబిజీగా పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం గుడివాడలోని తన నివాసంలో ఆయా మండలాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సరళి, ఇతర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో గురువారం (మే 23) నందివాడ మండల వైసీపీ నేతలతో నాని భేటీ అయ్యారు. వారితో చర్చలు జరుపుతుండగానే.. నిల్చొని ఉన్న కొడాలి నాని ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. దీంతో నేతలు, ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు.

 

 

 

 

 

  Last Updated: 24 May 2024, 11:01 AM IST