Great Rajanikanth : టాలీవుడ్ కు ఏమైంది.! చంద్ర‌బాబు అతిమంచిత‌న‌మే..చెడు అయిందా?

Great Rajanikanth : `హాపీగా ఉన్న‌పుడు ఎవ‌రూ అవ‌స‌రంలేదు. బాధ‌ల్లో ఉన్న‌ప్పుడు నేనున్నా..అంటూ ముందుకొచ్చే వాడు స్నేహితుడు.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 12:57 PM IST

Great Rajanikanth : `హాపీగా ఉన్న‌పుడు ఎవ‌రూ అవ‌స‌రంలేదు. బాధ‌ల్లో ఉన్న‌ప్పుడు నేనున్నా..అంటూ ముందుకొచ్చే వాడు స్నేహితుడు. ఆత్మ‌బంధువు అవుతాడని..` పెద్ద‌లు చెబుతారు. జైలులో ఉన్న చంద్ర‌బాబుకు నిజ‌మైన స్నేహితునిగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నిలిచారు. బ‌హుశా చంద్ర‌బాబుకు ఎవ‌రూ స్నేహితులు ఉండ‌ర‌ని చెప్పే వాళ్ల‌కు ర‌జ‌నీకాంత్ స‌రైన స‌మాధానం ఇచ్చార‌నుకుంటా. త‌న‌కంటూ న‌లుగురు ఆత్మీయుల‌ను సంపాదించుకోవాల‌ని స‌నాత‌న‌ధ‌ర్మం చెబుతోంది. న‌లుగురు కాదు…కొన్ని వేల రెట్లు ధైర్యం ఇచ్చేలా ర‌జ‌నీ కాంత్ ముందుకు రావ‌డం చంద్ర‌బాబు మంచిత‌నానికి నిద‌ర్శ‌నం.

చంద్ర‌బాబుకు ఎవ‌రూ స్నేహితులు ఉండ‌ర‌ని చెప్పే వాళ్ల‌కు.(Great Rajanikanth)

స్వ‌త‌హాగా చంద్ర‌బాబు భ‌య‌స్తుడ‌ని ద‌గ్గ‌ర నుంచి చూసిన వాళ్ల భావ‌న‌. ఎందుకంటే, ఏదైనా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు వ‌స్తాయ‌ని సొంతోళ్ల‌ను దూరంగా పెడ‌తారు. ప్ర‌త్య‌ర్థి దుష్ర్ర‌చారం చేస్తున్న‌ట్టు ఆయ‌న సామాజిక‌వ‌ర్గానికి చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా మేలు చేయ‌లేదు. పార్టీలోని క‌మ్మ సామాజిక‌వ‌ర్గం నాయ‌కులు అప్పుడ‌ప్పుడు బాధ‌ప‌డుతుంటారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాలకు నుంచి వ‌స్తే, ఈపాటికి టీడీపీలో పెద్ద పోస్ట్ లో ఉండే వాళ్ల‌మ‌ని ప్రైవేటు సంభాష‌ణ‌ల్లో చెప్పుకుంటారు. కాక‌పోతే, చంద్ర‌బాబుకు ఒక బ‌ల‌హీన‌త ఉంది. ఎవ‌రైనా స‌రే, తాను ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డేలా ప‌నిచేస్తానంటే సంతోష‌ప‌డ‌తారు. అందుకోసం స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తారు. పార్టీని చూడ‌రు, కులాన్ని చూడ‌రు, మ‌తాన్ని చూడ‌రు, ప్రాంతాన్ని చూడ‌రు. ప‌ది మందికి ఉపాథి క‌ల్పిస్తానంటూ వ‌స్తే చాలు పెద్ద పీఠ వేస్తారు. బ‌హుశా అదే ఆయ‌న బ‌ల‌హీన‌త. కానీ, దాన్నే చంద్ర‌బాబు బ‌లంగా ర‌జ‌నీకాంత్  (Great Rajanikanth) గుర్తించి ఉంటారు. అందుకే, నా స్నేహితుడు అనుస‌రించే ధ‌ర్మం మార్గం గెలుస్తుంద‌ని ధీమాతో ఉన్నారు.

చంద్ర‌బాబు బ‌లంగా ర‌జ‌నీకాంత్  

సినిమా ఇండ‌స్ట్రీకి చంద్ర‌బాబు ఎప్పుడూ ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానంలో తొలుత సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా చేశారు. ఆ హోదాను చూసిన త‌రువాత స్వ‌ర్గీయ ఎన్టీఆర్ త‌న కుమార్తె భువ‌నేశ్వ‌రిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆ రోజు నుంచి రాజ‌కీయ‌, సినీ రంగం ఒక‌టిగా టీడీపీలో మారిపోయింది. అదే అలవాటును చంద్ర‌బాబు కూడా కొన‌సాగించారు. సినీ ప‌రిశ్ర‌మ‌లోని ఎవ‌రొచ్చి ఏది అడిగినా చేసి పెట్టారు. ఆర్థికంగా బ‌లోపేత కావ‌డానికి ఎన్నో అవ‌కాశాల‌ను ఇచ్చారు. ప‌ది మందికి ఉపాధి క‌ల్పిస్తార‌ని సినిమా రంగంలోని ప్ర‌ముఖుల‌ను (Great Rajanikanth)ప్రోత్స‌హించారు. నంది అవార్డులు తెలంగాణ ప్ర‌భుత్వం ఇవ్వ‌న‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చింది. ఎప్పుడూ సినిమా హీరోల‌ను త‌న ఇంటి వ‌ద్ద ప‌డిగాపులు కాయించ‌లేదు. ప్ర‌త్యేక‌మైన గౌర‌వం ఇచ్చారు. అందుకే, ఆయ‌న మంచిత‌నం టాలీవుడ్ కు చేత‌గానిత‌నంలా క‌నిపించిన‌ట్టు ఉంది. క‌నీసం జైలుకు వెళ్లిన చంద్ర‌బాబు ప‌ట్ల సానుభూతిని ప్ర‌ద‌ర్శించ‌డానికి ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Tollywood vs CM Jagan: చిరు వ్యాఖ్యల్ని సమర్ధించిన వైసీపీ రెబల్ ఎంపీ

నిజం చెప్పాలంటే కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంటే సినీ ప‌రిశ్ర‌మ‌లోని కీల‌క‌ పెద్ద‌ల‌కు భ‌యం. ఎక్క‌డ ఇరికిస్తారోన‌ని తెలియ‌ని ఆందోళ‌న. అందుకే, తెలంగాణ సీఎం కేసీఆర్ పంచ‌న నిరీక్షించిన సంద‌ర్భాలు ఎన్నో.! ఆయ‌న పెట్టిన తెలుగు స‌భ‌ల‌కు కాకితో క‌బురు చేసినా క్యూ క‌ట్టారు. ప్రోటోకాల్ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఎవరికి వారే ప్ర‌జెంట్ వేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప‌రిపాల‌న మీద ప‌ల్లెత్తు మాట అన‌రు. అదే, చంద్ర‌బాబు ఏపీ సీఎంగా ఉండ‌గా అనేక ర‌కాలుగా మాట్లాడిన వాళ్లు ఉన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని మీద కూడా భిన్నాభిప్రాయాల‌ను స్వేచ్చ‌గా వెల్ల‌డించారు. కానీ, ఇప్పుడు సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అయిన త‌రువాత ఏపీ రాష్ట్రం చూడ‌డానికి భ‌య‌ప‌డుతున్నారు. అక్క‌డ జ‌రిగే ప‌రిపాల‌న మీద నోరు తెర‌వ‌డానికి వ‌ణికిపోతున్నారు. ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌న స్పీచ్ ల్లో ప‌లు మార్లు ప్ర‌స్తావించారు. భ‌య‌ప‌డి ఎంత దూరం వెళ‌తారు? పోరాడదాం రండీ అంటూ పిలుపు ఇచ్చారు.

Also Read : Jagan Script : ఒక జ‌డ్జిమెంట్ బోలెడు కోణాలు.!

కోలీవుడ్ హీరో ర‌జ‌నీకాంత్ ధ‌ర్మం గెల‌వాల‌ని కోరుకుంటూ చంద్ర‌బాబును జైలుకు పంప‌డం మీద స్పందించారు. హాలీవుడ్ యాక్ట‌ర్లు కూడా కొంద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట్ అయింది. చివ‌రికి పాకిస్తాన్ టీవీల్లోనూ చంద్ర‌బాబు స్కిల్ డ‌వ‌ల‌ప్మెంట్ చేసిన తీరు గురించి ప్ర‌స్తావించారు. కానీ, చంద్ర‌బాబు నుంచి ల‌బ్ది పొందిన టాలీవుడ్ ప్ర‌ముఖులు కొంద‌రు నోరు తెర‌వ‌క‌పోవ‌డం భావ‌దారిద్ర్య‌మా? భ‌య‌మా? నిస్స‌హాయ‌తా? భ‌విష్య‌త్ మీద ఆందోళ‌నా? అనేది బోధ‌ప‌డ‌డంలేదు. క‌నీసం కుటుంబ స‌భ్యుడు జూనియ‌ర్ ఎన్టీఆర్ ట్వీట్ కూడా చేయ‌క‌పోవ‌డం చంద్ర‌బాబు చేసుకున్న పాప‌మా? చేత‌గానిత‌నమా? అతి మంచిత‌న‌మా? అనేది ఎవ‌రికివారే నిర్ణ‌యించుకోవాలి.