CM Jagan : వాలంటీర్ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్‌.. జ‌న‌వ‌రి నుంచి ..?

గ్రామ వార్డు వాలంటీర్ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి గౌర‌వ వేత‌నాన్ని పెంచుతున్న‌ట్లు ప్రభుత్వం నిర్ణ‌యం

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 08:22 AM IST

గ్రామ వార్డు వాలంటీర్ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి గౌర‌వ వేత‌నాన్ని పెంచుతున్న‌ట్లు ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. వాలంటీర్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ.5,750కి పెంచుతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సేవకులకు ఇదో కానుక అని ఆయ‌న తెలిపాఉ. తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయ‌న ప్ర‌త్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి మీడియాతో ఈ విష‌యాన్ని తెలిపారు. వార్డు, గ్రామ వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని జనవరి 1 నుంచి రూ.750 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రస్తుతం వలంటీర్లకు నెలకు రూ.5000 వేతనం ఇస్తున్నామని నాగేశ్వరరావు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

అట్టడుగు స్థాయిలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు కోసం వాలంటీర్లు కృషి చేస్తున్నారు. ఏపీలో ప్రస్తుతం 2.6 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేతులు కలిపారని విపక్షాలపై మంత్రి మండిపడ్డారు. జగన్ తన తల్లిని, చెల్లిని గౌరవించ‌ర‌ని విజయనగరంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలను ఆయన ఖండించారు. అధికారం చేజిక్కించుకోవడానికి మామగారిని వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు అని, పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళను మోసం చేయడంలో పవన్ కళ్యాణ్‌కు రికార్డు ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు విమ‌ర్శించారు.

Also Read:  ED : సాహితీ ఇన్‌ఫ్రాటెక్ ఆస్తుల‌ను అటాచ్ చేసిన ఈడీ