Grama Volunteer: గంటలో పెళ్లి.. వాలంటీర్ విధులకు హాజరైన పెళ్లి కూతురు

విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలానికి చెందిన వధువు చేసిన పనికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. గంటలో పెళ్ళి పెట్టుకుని సదరు యువతీ విధుల్ని నిర్వర్తించింది. పని పట్ల తనకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంది.

Grama Volunteer: విశాఖపట్నం జిల్లా హుకుంపేట మండలానికి చెందిన వధువు చేసిన పనికి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. గంటలో పెళ్ళి పెట్టుకుని సదరు యువతీ విధుల్ని నిర్వర్తించింది. పని పట్ల తనకున్న చిత్తశుద్ధిని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుంది.

వధువు రోజా రాణి ఏపీలో గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్నది. మార్చి 1న హుకుంపేట మండలం పాటిగారుకు చెందిన కిరణ్‌సాయిని వివాహం చేసుకుంది. అయితే, ఆమె తన వివాహానికి కొన్ని గంటల ముందు ఉదయం తన ప్రాంతంలోని లబ్ధిదారులకు పింఛన్‌లను పంపిణీ చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిఒక్కరు ఆ యువతీ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో సహా ప్రతిపక్ష నేతలు ఆంధ్రప్రదేశ్‌లోని వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, ముఖ్యమైన సందర్భాల్లో కూడా తమ బాధ్యతలను విస్మరించకుండా వాలంటీర్లు తమ విధులను నిర్వర్తించడం ఆకట్టుకుంటుంది. అయితే రోజా రాణి చేసిన ఈ మంచి పని ఎలాంటి రాజకీయానికి దారి తీయలేదు.

Also Read: Pushpa 2 : పుష్ప స్పెషల్ ఐటమ్.. రేసులో మరో ముద్దుగుమ్మ..!