- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును కాస్త VB-G RAM G పేరుతో కొత్త చట్టం
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, పారదర్శకతను పెంచడం ఈ మార్పు
- ఈ చట్టం పై గ్రామా సభల ద్వారా ప్రజలకు అవగాహన
VB-G RAM G Bill : దశాబ్దాలుగా గ్రామీణ ప్రజలకు అండగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా VB-G RAM G అనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, పారదర్శకతను పెంచడం ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. ఈ నూతన చట్టం అమలు మరియు అందులోని ముఖ్యాంశాలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసింది. ఈ వ్యవస్థలో పని దినాల కల్పన మరియు నిధుల విడుదల ప్రక్రియ మరింత వేగవంతం కానుందని అధికారులు భావిస్తున్నారు.
Ap Gram Sabhas In Ap On 26t
ఈ కొత్త చట్టం గురించి ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీన రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా గ్రామసభలను నిర్వహించనున్నారు. ఈ సభల్లో కొత్త చట్టం వల్ల కలిగే ప్రయోజనాలను, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరియు పని గుర్తింపు కార్డుల ప్రాముఖ్యతను వివరిస్తారు. ముఖ్యంగా పాత చట్టంలో ఉన్న లోపాలను సవరించి, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ఆస్తుల కల్పనకు (Asset Creation) ఈ చట్టం ఎలా దోహదపడుతుందో అధికారుల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు ఈ సభల్లో చురుగ్గా పాల్గొని సామాన్యులకు అవగాహన కల్పించనున్నారు.
ఈ చట్టంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం పని దినాల పెంపు. గతంలో ఉన్న 100 పని దినాల పరిమితిని పెంచుతూ, ఇప్పుడు ఏడాదికి 125 పని దినాలను కల్పించనున్నారు. అంటే కూలీలకు అదనంగా 25 రోజుల పని లభించడం ద్వారా వారి వార్షిక ఆదాయం గణనీయంగా పెరగనుంది. దీనితో పాటు వేతనాల చెల్లింపు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (DBT) సకాలంలో చేరేలా సాంకేతిక మార్పులు కూడా చేశారు. గ్రామీణ వలసలను నివారించడానికి మరియు స్థానికంగానే ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ఈ ‘విబి-గ్రామ్ జి’ చట్టం ఒక మైలురాయిగా నిలవనుంది.
