Madanapalle : మదనపపల్లె ఫైళ్ల దగ్ధం కేసు..ముగ్గురి పై వేటు

ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా.

Published By: HashtagU Telugu Desk
Govt-suspends-three-officials-in-madanapalle-incident

Govt-suspends-three-officials-in-madanapalle-incident

Madanapalle: ఇటీవల అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో(Sub Collector Office) ఫైళ్ల దగ్ధం (Burning files)అయిన విషయం విదితమే. అయితే ఈ ఘటన పై చర్యలు మొదలయ్యాయి. దస్త్రాల దహనం కేసులో కొందరు అధికారులపై ప్రభుత్వం సస్పెన్షన్‌ వేటు వేసింది. పాత ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరిప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ గౌతమ్‌ను సస్పెండ్‌ చేసింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. భూ సమస్యల పైనే 80 శాతం అర్జీలు వస్తున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం భూమిని అడ్డం పెట్టుకుని దందా చేశారు.. రెవెన్యూ విషయంలో ప్రక్షళాన జరగాలని పేర్కొన్నారు. అధికారులకు బాధ్యతతో పాటు భయం కూడా ఉండాలని చెప్పారు. మదనపల్లె ఫైల్స్ ఘటనలో కొందరు అధికారులు బరి తెగించారని.. అందుకే మాజీ, ప్రస్తుత ఆర్డీవోలను, సీనియర్ అసిస్టెంటుని సస్పెండ్ చేశామని అన్నారు. అసైన్డ్ భూములపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారని మంత్రి తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రూపకల్పనకు చర్యలు చేపట్టామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి.. ఇళ్ల పట్టాల కోసం భూ పంపిణీ పేరుతోనూ అక్రమాలు చేపట్టారని అన్నారు. పాసు పుస్తకాలు, సర్వే రాళ్లపై బొమ్మలు వేయించుకున్నారనే అంశంపై చర్చించామని తెలిపారు. 75 లక్షల సర్వే రాళ్లున్నాయి.. వాటిని తొలగించాలంటే రూ. 15 కోట్లు ఖర్చు అయ్యేలా ఉందన్నారు. మరోవైపు.. కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రూపొందిస్తున్నాం.. తాము ఇచ్చే పట్టాదార్ పాసు పుస్తకాలపై రాజముద్ర ఉంటుందని తెలిపారు. విశాఖ, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఉమ్మడి జిల్లాల్లో భూ సమస్యలు ఉన్నాయి.. త్వరలో ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో భూ సమస్యల పరిష్కారంపై సమావేశాలు పెడతామని చెప్పారు.

కాగా.. రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ప్రమాదం కాదని అన్నారు. కుట్రలో భాగంగానే ఫైళ్లను తగులబెట్టారని తెలిపారు. ఫైళ్లపై ఏదో కెమికల్ చల్లారు.. కెమికల్ చల్లకుండా ఇంత పెద్ద ఎత్తున ఫైళ్లు త్వరగా దగ్దం కావని ఆయన చెప్పారు. కానీ మదనపల్లె ఫైల్స్ ఘటనలో కేవలం 17 నిమిషాల్లో ఫైళ్లన్నీ దగ్దం అయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు.. ఎమ్మార్వో సంతకం ఫోర్జరీ చేశారు.. ఆ ఫైళ్లను దగ్దం చేశారనే ఆరోపణ ఉందని తెలిపారు. 14 వేల ఎకరాల చుక్కల భూములను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారు.. ఇదెలా సాధ్యం..? అని ప్రశ్నించారు. ఎంతటి వారైనా సరే ఫైళ్ల దగ్దం ఘటనలో వదిలిపెట్టమని తెలిపారు. ఫైళ్ల దగ్దం ఘటన వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు.. మొత్తం 2200 ఫైళ్లను దగ్దం చేశారని ఆర్పీ సిసోడియా పేర్కొన్నారు.

Read Also: Health Tips: నోరు తెరిచి నిద్రపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

 

  Last Updated: 29 Jul 2024, 05:24 PM IST