Site icon HashtagU Telugu

Liquor Scam : గోవిందప్పకు రిమాండ్

Balaji Govindappa Remand

Balaji Govindappa Remand

ఆంధ్రప్రదేశ్‌(AP)లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం (Liquor Scam) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న A33 నిందితుడు బాలాజీ గోవిందప్ప(Balaji Govindappa)ను ఏసీబీ కోర్టు రిమాండ్‌(ACB Court Remand)కు ఆదేశించింది. ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. అనంతరం పోలీసులు గోవిందప్పను విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్టయిన సంగతి తెలిసిందే.

Mudra Loan : సొంతంగా బిజినెస్ చేయాలనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్

ఇదే స్కాంలో మరో ఇద్దరు ముఖ్య నిందితులు A31 ధనుంజయ్ రెడ్డి, A32 కృష్ణమోహన్‌లను ఇవాళ సిట్ అధికారులు విచారించారు. వీరిద్దరూ కేసులో కీలక పాత్ర పోషించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో కీలక ఆధారాలు వెలుగులోకి రాగలవని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

అయితే సుప్రీం కోర్టు ఇప్పటికే వీరిని ఈ నెల 16 వరకు అరెస్టు చేయకూడదని స్పష్టం చేసిన నేపథ్యంలో, అధికారులు ప్రస్తుతం విచారణకే పరిమితమయ్యారు. ఈ కేసు లో మరిన్ని వివరాలు సమర్పించాల్సిన అవసరం ఉందని, విచారణ కొనసాగుతుందని సిట్ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లినట్టు ఈ స్కాంలో ఆరోపణలు రావడం గమనార్హం.