టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఫై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు ఛస్తాడని.. జగన్మోహన్ రెడ్డి (Jagan) సీఎం అవుతారంటూ వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికలను టార్గెట్ గా పెట్టుకున్న వైసీపీ సర్కార్ (YCP)..నిన్న గురువారం సామాజిక సాధికార బస్సు యాత్ర (Samajika Sadhikara Bus Yatra) ను ఇచ్ఛాపురం నుండి ప్రారంభించారు. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు బయలు దేరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని నేతలు ప్రజలకు వివరించనున్నారు.
ఈ సందర్భంగా గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు బస్సు యాత్ర చేసి.. జైలు యాత్ర చేస్తున్నాడని , పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసి పారిపోయే యాత్ర చేస్తున్నారని విమర్శించారు. లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి పిల్లి యాత్ర చేస్తున్నాడన్నారు. అలాగే 2024లో చంద్రబాబు ఛస్తాడని.. జగన్ సీఎం అవుతారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు అనుమానాలను తెరమీదకు తీసుకొస్తున్నారు.
చంద్రబాబు ను జైల్లో పెట్టిన దగ్గరి నుండి ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపిస్తూ వస్తున్న కుటుంబ సభ్యులు , టీడీపీ శ్రేణులు..ఇప్పుడు గోరంట్ల మాధవ్ వచ్చే ఏడాది చంద్రబాబు చనిపోతాడని అనడం పట్ల మరింత అనుమానిస్తున్నారు. జైలులోనే చంద్రబాబును చంపేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Bigg Boss 7 : రతిక మారలేదు.. ఆమె నామినేషన్ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్..!