Delimitation : టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య నియోజకవర్గాల పునర్విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కేంద్రంతో అంతర్గతంగా మాట్లాడుతున్నారన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొన్నారు. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాల ముందు నుంచి చాలా క్రమశిక్షణ పాటించాయని, ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని వ్యాఖ్యానించారు.
Read Also: Rule Change: బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే!
జగన్ హయాంలో పంటలకు బీమా కూడా చెల్లించకపోవడంతో రైతులు రూ.వేల కోట్లు నష్టపోయారు. గత ప్రభుత్వం గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు. జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కించాల్సిందే. నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్‌లా మాట్లాడారు. మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని ఆయన అంటున్నారు. ఆయన వచ్చేది రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకే. వైసీపీ హయాంలోని లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి అన్నారు. రానున్న పుష్కరాలకు రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు చేస్తున్నాం.
రాజమహేంద్రవరంలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో ఇప్పటికే మాట్లాడాను. గతంలో వైసీపీ కార్యాలయానికి రాజమహేంద్రవరంలో అధికారులు తక్షణమే స్థలం ఇచ్చేశారు. టీడీపీ కార్యాలయం కోసం స్థలం అడుగుతుంటే మాత్రం ఇవ్వడం లేదు అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం సహాయ నిధి ఇచ్చి ప్రజలను ఆదుకుంటున్నాం. మేలో తల్లికి వందనం, జూన్‌లో అన్నదాత సుఖీభవ అమలు చేయబోతున్నాం అన్నారు.