ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు!

Pradhan Mantri Ujjwala Yojana : పేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో మహిళలకు ఉచితంగా గ్యాస్ […]

Published By: HashtagU Telugu Desk
Free Gas Connection In Ap

Free Gas Connection In Ap

Pradhan Mantri Ujjwala Yojana : పేద మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను ఆంధ్రప్రదేశ్‌లోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నారు. సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • ఏపీలో మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు
  • రూ.2వేలు కట్టాల్సిన పనిలేదు.. ఉచితంగానే
  • 2025-26కు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రం అమలు చేస్తున్న పలు పథకాలను రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. అయితే పేద మహిళల కోసం కేంద్రం ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను తీసుకురాగా.. ఈ పథకం నాలుగేళ్లుగా నిలిచిపోయినప్పటికీ, ఇప్పుడు మళ్లీ పునఃప్రారంభించారు. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై)ను రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద మహిళలకు 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు.. దీనివల్ల ఎంతోమంది మహిళలకు వంటగ్యాస్ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.

ఈ మేరకు ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా అందిస్తోంది. సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ పుస్తకం, బిగింపు ఖర్చులన్నీ ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. ఈ పథకం కింద, సిలిండర్‌కు రూ.1,700, రెగ్యులేటర్‌కు రూ.150, ఒక మీటరు పైపుకు రూ.100, గ్యాస్ పుస్తకానికి రూ.25, ఇంట్లో బిగించేందుకు రూ.75 ఖర్చు అవుతుంది. ఈ మొత్తం రూ.2,050ను ఆయిల్ కంపెనీలే భరిస్తాయి. అంటే, ప్రజలకు గ్యాస్ కనెక్షన్ పొందడం చాలా సులభం అవుతుంది. మొదటి సిలిండర్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తారు. ఆ తర్వాత సిలిండర్‌ను కొనుగోలు చేసేటప్పుడు, కేంద్ర ప్రభుత్వం రూ.300 రాయితీని ఇస్తుంది. దీనివల్ల సామాన్యులకు గ్యాస్ వాడకం మరింత అందుబాటులోకి వస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి, ప్రతి జిల్లాలో ‘జిల్లా ఉజ్వల కమిటీ’ని నియమించారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా ఉంటారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ప్రతినిధి జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కూడా ఈ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. ఈ కమిటీ పథకం అమలును పర్యవేక్షిస్తుంది. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారికి, వారి ఇంట్లో ఎటువంటి గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు. దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా ఇవ్వాలి.

వలస కార్మికులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. వారు కూడా అవసరమైన పత్రాలు సమర్పించి గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు. అయితే, నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. ఆదాయ ధ్రువీకరణ కోసం రెవెన్యూ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. అర్హులైన పేద మహిళలు దగ్గరలోని ఏజెన్సీల వద్దకు వెళ్లి, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకం కింద 14.2 కిలోల ఒక సింగిల్ సిలిండర్ లేదా 5 కిలోల రెండు సిలిండర్లు పొందవచ్చు. అర్హులైన ప్రతి మహిళా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

 

  Last Updated: 15 Dec 2025, 11:55 AM IST