మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. MRP ధరలకే విక్రయం !

Andhra Pradesh Liquor  ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి… […]

Published By: HashtagU Telugu Desk
Ap Liquor Price

Ap Liquor Price

Andhra Pradesh Liquor  ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు అందాయి. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన పవన్ కల్యాణ్… అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేశారు. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుందని అన్నారు.
మద్యం విక్రయాలకు సంబంధించి దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.
ఇదిలాఉంటే, పవన్ కల్యాణ్ సోమవారం సాయంత్రం మంగళగిరిలో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘వైసీపీ పాలనలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్ తేల్చింది. రసాయనాలు, పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు’ అని అన్నారు.
‘‘వైసీపీ నాయకులంటే నాకు వ్యక్తిగత ద్వేషం, వైరం లేదు. వాళ్ల భాష, క్రిమినాలిటీతోనే సమస్య. ఇళ్లల్లోకి వస్తాం… దాడులు చేస్తాం… నరికేస్తాం అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతారు. వాళ్ల భాష సరిగా లేని కారణంగానే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి’’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
‘‘దాడులను, హింసను ఏ రాజకీయ పార్టీ సమర్థించదు.సీఎం చంద్రబాబు నాయుడు కూడా చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని పదేపదే చెబుతున్నారు. అలా జరిగితే సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదనీ హెచ్చరించారు. మనం ప్రజలకు చెప్పే మంచి వెళ్లే లోపు వైసీపీ నాయకులు జనాల్లో భయం క్రియేట్ చేస్తున్నారు. మళ్లీ మేము వస్తే అంటూ రకరకాలుగా బెదిరింపు కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఇలాంటి కామెంట్లు చేసే ఆ పార్టీ 151 నుంచి 11కి పడిపోయింది. అయినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రాలేదు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. మరో 15 ఏళ్లు కూటమి అధికారానికి ఢోకా లేదు. ప్రజలు చాలా తెలివైనోళ్లు. వాళ్లు ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు’’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
  Last Updated: 04 Feb 2026, 04:13 PM IST