ప్రస్తుతం డిజిటల్ యుగం కొత్త పుంతలు తొక్కుతోంది. దీనికి తోడు నెట్ (Internet) సేవలు వినియోగం పెరిగిపోయింది. పట్టణాల నుంచి మారుమూల పల్లెల వరకు నెట్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఇంటర్నెట్ వాడకం పెరగడంతో పిల్లలు, పెద్దలు, యువత నచ్చిన సినిమాలను టీవీల్లో (Movies at Home) చూస్తున్నారు. ఇప్పటికే ఓటీటీ లాంటి సంస్థలు మంచి మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ (Ap) ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.
ఏపీలో తక్కువ ధరలకే నెట్ సేవలను అందిస్తున్నామని, సినిమాలను బట్టి పైబర్ నెట్ తో ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పైరసీ లేకుండా ఇంట్లోనే (Movies at Home) సినిమాలు చూడొచ్చు అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో అతి తక్కువ ధరలకు ఏపీలో నెట్ సేవలను అందిస్తున్నామని, తద్వారా రిలీజ్ రోజు ఏ సినిమానైనా ఇంట్లో చూడొచ్చు అని ఆయన తెలిపారు.
Also Read: Book Lovers: పార్కుకు వెళ్దాం.. నచ్చిన పుస్తకాలను చదివేద్దాం!