Golconda Blue : ‘గోల్కొండ బ్లూ’.. ఈ అరుదైన వజ్రాన్ని మన భారతదేశంలోనే వెలికితీశారు. అయితే దీన్ని మే 14న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో వేలం వేయనున్నారు. 23.24 క్యారెట్ల విలువైన ఈ వజ్రాన్ని వేలం వేసేందుకు ‘‘ క్రిస్టీస్ మాగ్నిఫిసెంట్ జ్యువెల్స్’’ పేరుతో ప్రత్యేక సేల్‌ను నిర్వహించబోతున్నారు. వేలంలో దీని ధర దాదాపు రూ.430 కోట్లు పలికే అవకాశం ఉంది. రాజ వారసత్వం, అసాధారణ రంగు, పరిమాణం వంటి విశేషాలతో కూడిన ‘గోల్కొండ బ్లూ’(Golconda Blue) ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ ఓ ప్రకటనలో తెలిపింది.
Also Read :Vivek Vs Premsagar : అధిష్ఠానం అన్యాయం చేస్తే సహించను.. ప్రేమ్‌సాగర్‌రావు సంచలన వ్యాఖ్యలు
‘గోల్కొండ బ్లూ’ వజ్రం చరిత్ర ఇదీ..
- తెలంగాణలోని గోల్కొండ గనుల్లో ‘గోల్కొండ బ్లూ’ వజ్రం దొరికింది.
- ఈ వజ్రం తొలుత 20వ శతాబ్దంలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మహారాజు యశ్వంత్ రావు హోల్కర్ -2 వద్దకు చేరిందని అంటారు.
- 1923లో మహారాజు యశ్వంత్ రావు హోల్కర్ -2 తండ్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వజ్రాన్ని ఫ్రాన్స్‌కు చెందిన చౌమెట్ (Chaumet) కంపెనీకి అప్పగించారు. ఈ వజ్రాన్ని పొదిగి తనకు చేతి కంకణం (బ్రేస్ లెట్) తయారు చేసివ్వాలని చౌమెట్‌కు ఆర్డర్ ఇచ్చారు.
- 1930వ దశకంలో ఈ వజ్రాన్ని ఇండోర్ మహారాణి పెయింటింగ్‌లో పొదిగారు. ఈ పెయింటింగ్‌ను ప్రముఖ ఫ్రాన్స్ కళాకారుడు బెర్నార్డ్ బౌటెట్ డీ మోన్వెల్ గీశారు.
- 1947 నాటికి ఈ వజ్రం భారతదేశం దాటిపోయి.. అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండేే హ్యారీ విన్‌స్టన్ వద్దకు చేరింది. మహిళలు వస్త్రాలపై పెట్టుకునే పిన్‌లోకి ఈ వజ్రాన్ని ఆయన పొదిగించారు.
- తదుపరిగా ఈ వజ్రం భారత్‌లోని బరోడా మహారాజు వద్దకు చేరింది.
- అనంతరం ఈ వజ్రం మళ్లీ ఐరోపా దేశాల్లోని వజ్రాల వ్యాపారుల వద్దకు చేరింది.
- మొత్తం మీద ఈ వజ్రం ఎన్నో ఖండాలను తిరిగింది. ఎన్నో చరిత్రలను చూసింది. ఎన్నో మార్పులకు గురైంది.