ఈనాడు గ్రూప్స్ అధినేత , మార్గదర్శి చిట్ ఫండ్ (Margadarsi Chit Fund ) ఛైర్మన్ రామోజీరావు(Ramoji Rao)కు ఏపీ CID భారీ షాక్ ఇచ్చారు. మార్గదర్శిలతో తమకు రావాల్సిన వాటా గురించి అడిగితే రామోజీరావు తుపాకీతో బెదిరించి బలవంతంగా తమ పేరిట రాయించుకున్నారని గాదిరెడ్డి యూరిరెడ్డి (Yuri Reddy) పిర్యాదు చేయడం తో రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్ ( Ramoji Rao and Sailaja) పై ఐపీసీ సెక్షన్లు 420, 467, 120-B, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల ప్రకారం CID కేసు నమోదు చేసింది. మార్గదర్శిలో తమ షేర్ల వాటాను శైలజ పేరు మీదకి మార్చారని, తనను బెదిరించి బలవంతంగా తన వాటా లాక్కున్నారని యూరిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
2016 సంవత్సరం నాటికి తన పేరు మీద ఉన్న షేర్ల విలువ రూ. కోటి 59 లక్షల 69 వేలు కాగా, రామోజీరావు కేవలం రూ.39 లక్షల 74 వేల యూనియన్ బ్యాంక్ చెక్కు ఇచ్చారని ఫిర్యాదులో తెలిపారు. అయితే తాను సంతకం పెట్టలేదని, తన సంతకం ఫోర్జరీ చేసి తన పేరిట ఉన్న వాటాలను తమకు సంబంధించిన వారి పేరిట మార్చారని యూరిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. 1962లో మార్గదర్శి చిట్ ఫండ్ పెట్టిన సమయంలో తన తండ్రి జగన్నాథరెడ్డి రూ.5 వేలు పెట్టుబడి పెట్టారని చెప్పారు. అందుకుగానూ మార్గదర్శిలో తండ్రి జగన్నాథరెడ్డి పేరిట కొన్ని షేర్లు రామోజీరావు ఇచ్చారని తెలిపారు.
తన తండ్రికి మార్గదర్శిలో షేర్లు ఉన్నాయని తెలిసి అపాయింట్ మెంట్ కోరగా చాలాకాలం రామోజీరావు తమను కలిసేందుకు ఇష్టపడలేదన్నారు. 29 సెప్టెంబర్ 2016లో రామోజీరావును కలిసిన సమయంలో బెదిరించి తన వాటా రాయించుకున్నారని యూరిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇటీవల తమ షేర్ హోల్డింగ్‌పై స్పష్టత రావడంతోనే ఫిర్యాదు చేస్తున్నట్లు యూరిరెడ్డి తెలిపారు. అయితే సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టెయ్యాలంటూ రామోజీరావు, శైలజలు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసు హైకోర్టులో సురేష్ రెడ్డి బెంచ్ కు వెళ్ళింది. అయితే ఆయన తాను విచారణ చేయలేనని చెప్పడంతో ఇప్పుడు దాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ కేసును కోర్టు రేపు విచారించే అవకాశం ఉంది.
Read Also : Polling Holidays : మరో 3 రోజులు సెలవులు.. ఎందుకంటే ?