Site icon HashtagU Telugu

Getup Srinu : డబ్బు తీసుకోని జనసేనకు ప్రచారం చేశారనే ప్రచారం ఫై గెటప్ శ్రీను క్లారిటీ

Getapsrinu Pawan

Getapsrinu Pawan

ఏపీ(AP)లో మరో వారం రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. ఈసారి కూటమి vs వైసీపీ మధ్య హోరాహోరి పోటీ నడుస్తుంది. ఇరు పార్టీలు ఎవరికీ వారు గెలుపు ఫై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అందరి చూపు పిఠాపురం పైనే ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడం తో ఈసారి పవన్ గెలుస్తాడా.? ఎంత మెజార్టీ తో గెలవబోతున్నాడంటూ ,..? అంత మాట్లాడుకుంటున్నారు. ఇదే తరుణంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గెలుపు కోసం బుల్లితెర నటి నటులతో పాటు వెండితెర ఫై నటులు సైతం ప్రచారం చేస్తూ వస్తున్నారు. జబర్దస్త్ టీమ్ తో పాటు మెగా హీరోలు వరుణ్ తేజ్ , సాయి తేజ్ , వైష్ణవ్ తేజ్ తదితరులు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేతలు జబర్దస్త్ టీమ్ ప్రచారం ఫై అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. డబ్బులు తీసుకోని వారంతా ప్రచారం చేసారని..జబర్దస్త్ లో ఎలాగైతే రోజు వారి డబ్బులు తీసుకుంటారో..ప్రచారం కూడా అలాగే చేసారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఆరోపణలపై గెటప్ శ్రీను (Getup Srinu) క్లారిటీ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

జబర్దస్త్ బ్యాచ్‌లో చాలా మంది నటులు ఇప్పుడు పిఠాపురంలోనే ప్రచారంలో ఉన్నారని గెటప్ శ్రీను తెలిపారు. పాటు సుధీర్, రాంప్రసాద్ తదితర నటులందరూ పవన్ కళ్యాణ్ మీదున్న అభిమానంతో ప్రచారంలో పాల్గొంటున్నారని.. నాగబాబుకు ఫోన్ చేసి, ప్రచారంలో పాల్గొంటామని అడిగి వెళ్లామని చెప్పారు. ‘పిల్ల బ్యాచ్‌’ను పెద్దగా పట్టించుకోవద్దు అంటూ జ‌బ‌ర్దస్త్ టీమ్‌పై రోజా చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు గెటప్ శ్రీను బదులిచ్చారు. గెట‌ప్ శ్రీ‌ను హీరోగా నటించిన ‘రాజూ యాద‌వ్‌’ సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేడుకలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు గెటప్ శ్రీను సమాధానం ఇచ్చారు. ‘పిఠాపురంలో మేం స్వచ్ఛందంగానే ప్రచారం చేస్తున్నాం. మా అకౌంట్ నెంబ‌ర్లు చెక్ చేసుకోండి. ఎవ‌రెంత డ‌బ్బులు తీసుకున్నారో, అస‌లు డ‌బ్బులు ప‌డ్డాయో లేదో మీకే తెలుస్తుంది’ అని గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చారు. అలాగే పిఠాపురం లో పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీ సాదించబోతున్నారని అడుగగా..లక్ష మెజార్టీ తో గెలవబోతున్నాడని స్పష్టం చేసారు.

Read Also : Peddapalli : కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. ముగ్గురు మహిళా కూలీలు మృతి