వైసీపీ మునిగిపోయే నావ అని, ఆ పార్టీలో వైఎస్ జగన్ తప్ప ఎవరూ మిగలరని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఏపీలో టీడీపీ (TDP) పార్టీకి పూర్తి స్థాయిలో పూర్వ వైభవం రాబోతుంది. గతంలో టీడీపీ వీడి వైసీపీ (YCP) లో చేరిన నేతలు , కార్యకర్తలు ఇలా అంత కూడా మళ్లీ సొంత గూటికి వస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు 90 % టీడీపీ శ్రేణులు తిరిగి సైకిల్ ఎక్కగా..ఇప్పుడు మిగతా 10 % కూడా సైకిల్ ఎక్కుతూ, వైసీపీ కార్యకర్తలు అంటూ లేకుండా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కంచుకోటాలను సైతం టీడీపీ బద్దలు కొట్టగా..ఇప్పుడు చిన్న చితక వారిని సైతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా వైసీపీ రాజ్యసభ పదవికి, పార్టీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. ఇద్దరు ఎంపీల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోపిదేవి కుడి భుజంలా వ్యవహస్తే.. బీద మస్తాన్ రావుపార్టీలో కీలక వ్యవహరించారు. ఇప్పుడు వీరిద్దరూ పార్టీకి రాజీనామా చేయడంతో కేడర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నేతలే తమ దారి తాము చూసుకుంటుంటే తమ పరిస్థితేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం వీరే కాదు మిగతా ఎంపీలు కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇలా వరుసపెట్టి వైసీపీ నేతలు రాజీనామాలు చేస్తుండడం ఫై గంటా శ్రీనివాస్ రావు స్పందించారు.
విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన (Ganta Srinivasa Rao) మాట్లాడుతూ.. మొన్నటి ఎన్నికల్లో కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇక వైసీపీ మునిగిపోయే నావ (Sinking boat) లాంటిదని తాము ముందే చెప్పామని అన్నారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేసి టీడీపీ(TDP) లో చేరుతామంటే స్వాగతిస్తున్నామని వెల్లడించారు. పరిస్థితిని చూస్తుంటే వైసీపీలో జగన్ తప్ప ఎవరూ మిగిలేల లేదని వ్యాఖ్యనించారు. ఈ పరిస్థితికి కర్త, కర్మ, క్రియ జగన్ కారణమని గంటా శ్రీనివాసరావు దుయ్యబట్టారు. తాము గేట్లు తెరిస్తే వైసీపీ మొత్తం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ముందుకు వస్తే వారిని పార్టీలోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
Read Also : Mutton Fight Viral : మటన్ ముక్క ఎంత పనిచేసింది..!!