Gannavaram Political Heat : వంశీకి కౌండౌన్, టీడీపీలోకి యార్ల‌గ‌డ్డ‌?

గ‌న్న‌వ‌రం రాజ‌కీయం (Gannavaram Political Heat)వేగంగా మారిపోతోంది. ఎమ్మెల్యే వంశీను అధిగ‌మించే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు.

  • Written By:
  • Updated On - August 18, 2023 / 02:38 PM IST

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం రాజ‌కీయం (Gannavaram Political Heat)  వేగంగా మారిపోతోంది. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ కార‌ణం ప‌డిన ఇబ్బందుల‌ను అధిగ‌మించే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. అక్క‌డ నుంచి యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావును  రంగంలోకి దింప‌డానికి రంగం సిద్ద‌మైయింది. ఆయన ప్ర‌స్తుతం వైసీపీలో వంశీ దెబ్బ‌కు రగిలిపోతున్నారు. పార్టీ మారేందుకు ఆత్మీయస‌భ‌ల‌ను పెట్టుకున్నారు. మోజార్టీ అనుచ‌రులు టీడీపీలో చేరాల‌ని సూచించార‌ట‌. ఇక ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల నుంచి వ‌చ్చే సంకేతాల ఆధారంగా శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు తీసుకోనున్నారు.

టీడీపీ నుంచి యార్ల‌గడ్డ వెంక‌ట్రావు పోటీచేసే ఆలోచ‌న‌ (Gannavaram Political Heat) 

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం (Gannavaram Political Heat)  నుంచి పోటీ చేస్తాన‌ని యార్ల‌గ‌డ్డ ప్ర‌క‌టించారు. అయితే, ఏ పార్టీ నుంచి అనేది చెప్ప‌డంలేదు. ప్ర‌స్తుతం వైసీపీ నుంచి వ‌ల్ల‌భ‌నేని వంశీ పోటీచేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆ మేర‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. దీంతో ఇక టీడీపీ నుంచి యార్ల‌గడ్డ వెంక‌ట్రావు పోటీచేసే ఆలోచ‌న‌తోనే `గ‌న్న‌వ‌రం నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో ఉంటాన‌ని` ప్ర‌క‌టించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఆయ‌న‌తో పాటు దుట్టా రామ‌చంద్రరావు కూడా వైసీపీకి గుడ్ బై చెప్ప‌డానికి సిద్దమైన‌ట్టు గ‌న్న‌వ‌రం రాజ‌కీయ‌వ‌ర్గాల్లోని చ‌ర్చ‌.

అంటు యార్ల‌గ‌డ్డ ఇటు వంశీ మ‌ధ్య  స‌యోధ్య కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నం

అమెరికా నుంచి వ‌చ్చిన యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు 2018 నుంచి వైసీపీకి ప‌నిచేస్తున్నారు. ఆయ‌న స్థానికంగా ఉండే దుట్టా రామ‌చంద్రరావు మ‌ద్ధ‌తుతో గ‌న్న‌వ‌రంలోని ప్ర‌తి ఇంటికీ తిరిగారు. ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల‌ను క‌లుసుకున్నారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం 270 ఓట్ల తేడాతో టీడీపీ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ మీద ఓడిపోయారు. ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత వంశీ వైసీపీ పంచ‌న చేరారు. అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీ బులిటెన్లో ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ద‌గ్గ‌ర‌య్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు మీద దురుసుగా దూష‌ణ‌ల‌ను వినిపించారు. తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా(Gannavaram Political Heat)  గ‌ళం విప్పారు. వైసీపీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేయ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నుంచి అనుమ‌తి పొందారు.

లోకేష్ స‌మ‌క్షంలో యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు టీడీపీలో

టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ ఎప్పుడైతే వైసీపీకి ద‌గ్గ‌ర‌య్యారో, ఆ రోజు నుంచి యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు అసంతృప్తిగా వైసీపీ అధిష్టానం మీద ఉన్నారు. అంటు యార్ల‌గ‌డ్డ ఇటు వంశీ మ‌ధ్య  స‌యోధ్య కుదుర్చేందుకు ప‌లుమార్లు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌య‌త్నం చేశారు. స‌హ‌క‌రిస్తే, ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తామ‌ని ఆఫ‌ర్ చేశార‌ట‌. కానీ, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, స‌ర్పంచ్ ల ఎన్నిక‌ల్లో వంశీ అనుచ‌రుల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డాన్ని యార్ల‌గ‌డ్డ ఏ మాత్రం మ‌రిచిపోలేక‌పోతున్నారు. రాజ‌కీయ ప్రాధాన్యం త‌గ్గించే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని తెలుసుకున్న ఆయ‌న వైసీపీకి గుడ్ బై చెప్ప‌డానికి  (Gannavaram Political Heat) సిద్ధ‌మ‌య్యార‌ని తెలుస్తోంది.

Also Read : CBN Achievement : చంద్ర‌బాబు తుఫాన్! TDPలోకి బాలినేని?

గ‌త రెండు రోజులుగా ఆత్మీయుల‌తో భేటీ అవుతోన్న యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు పార్టీ మారే ఆలోచ‌నను పంచుకుంటున్నార‌ట‌. అంద‌రూ టీడీపీలోకి మారాల‌ని సూచించార‌ని తెలుస్తోంది. దీంతో ఆయ‌న త్వ‌ర‌లోనే సైకిల్ ఎక్క‌బోతున్నార‌ని తెలుస్తోంది. టీడీపీ త‌ర‌పున వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని స‌మాచారం. ఎందుకంటే, ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రం టీడీపీ త‌ర‌పున వంశీకి ధీటుగా ప‌నిచేసే నాయ‌కులు ఎవ‌రూ పెద్ద‌గా లేరు. గ‌తంలో బ‌చ్చుల అర్జునుడు ఇంచార్జిగా ఉన్నారు. ఆయ‌న త‌ద‌నంత‌రం మాజీ ఎంపీ కొన‌గ‌ళ్ల నారాయ‌ణ‌కు అప్ప‌గిస్తూ ఐదుగురితో కూడిన స‌మన్వ‌య క‌మిటీని వేశారు. అయినప్ప‌టికీ వంశీ ప్రాబ‌ల్యానికి త‌ట్టుకోలేని ప‌రిస్థితి. ఇప్పుడు వైసీపీ నుంచి వ‌స్తోన్న యార్ల‌గడ్డ వెంక‌టరావు (Gannavaram Political Heat)  ధీటైన అభ్య‌ర్థిగా టీడీపీ భావిస్తోంది.

Also Read : CBN Raksha Bandhan : చంద్ర‌న్న రాఖీలు వ‌చ్చేస్తున్నాయ్..!

అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే, ఈనెల 19వ తేదీ త‌రువాత ఎప్పుడైనా టీడీపీలో చేరే అవ‌కాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోకి ఈనెల 19న యువ‌గ‌ళం యాత్ర చేరుకుంటుంది. ఆ సంద‌ర్భంగా లోకేష్ యాత్ర కొన‌సాగ‌నుంది.అందుకే, ఈనెల 19వ తేదీ త‌రువాత ఏ రోజైనా లోకేష్ స‌మ‌క్షంలో యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు టీడీపీలో చేర‌తార‌ని బ‌ల‌మైన టాక్. అమెరికాలో వ్యాపారాలు ఉన్న‌ప్ప‌టికీ గ‌న్న‌వ‌రంను వ‌ద‌ల‌కుండా గ‌త నాలుగేళ్లుగా ప్ర‌జ‌ల్లో వెంక‌ట్రావు ఉన్నారు. అక్క‌డి క్యాడ‌ర్, ప్ర‌జ‌ల‌కు చేరువయ్యారు. పైగా స్థానికంగా బ‌లంగా ఉన్న దుట్టా రామ‌చంద్ర‌రావుతో కూడా బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయి. ఇంకో వైపు తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గం గ‌న్న‌వ‌రం. అందుకే, వంశీ మీద గెలుపు అవ‌కాశాలు యార్ల‌గ‌డ్డ‌కు మెండుగా ఉన్నాయ‌ని స‌ర్వేల సారాంశం. ఇక వంశీకి కౌండౌన్ ప్రారంభమైన‌ట్టేన‌ని చంద్ర‌బాబు అండ్ టీమ్ అంచనా వేస్తోంది.