Thank you, @naralokesh garu, for your kind words and best wishes. Andhra Pradesh is where Amara Raja’s journey began, and it will always be special to us. Our roots are deep, our commitment remains unwavering, and I am confident they will only grow stronger in the years ahead.… https://t.co/9mZg07NzDQ
— Jay Galla (@JayGalla) July 17, 2026
అమరరాజా గ్రూప్ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రారంభమైందని, ఈ ప్రాంతంతో తమకున్న బంధం ఎప్పటికీ ప్రత్యేకమని సంస్థ అధినేత, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టుకు ఆయన శుక్రవారం స్పందించారు.
గత ప్రభుత్వ హయాంలో అమరరాజా గ్రూప్ ఏపీని వీడి తెలంగాణలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. చిత్తూరులో పుట్టిన అమరరాజా సంస్థ, గత వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. దీనికి ఏపీ క్షమాపణ చెప్పాలని, సంస్థకు రాష్ట్ర ద్వారాలు, హృదయాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆయన తన పోస్టులో తెలిపారు.
లోకేశ్ పోస్టుకు గల్లా జయదేవ్ బదులిచ్చారు. “మీ ఆత్మీయ వచనాలకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. అమరరాజా ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌లోనే మొదలైంది. ఇది మాకు ఎప్పటికీ ప్రత్యేకమే. మా మూలాలు ఇక్కడే బలంగా ఉన్నాయి. మా నిబద్ధత చెక్కుచెదరదు, భవిష్యత్తులో ఇది మరింత బలపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. మనమంతా కలిసి కొత్త అవకాశాలను సృష్టిస్తూ ఉజ్వల భవిష్యత్తును నిర్మిద్దాం” అని జయదేవ్ తన పోస్టులో పేర్కొన్నారు.
