శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ (PDF MLC Shaik Sabji) దుర్మరణం (Died ) చెందిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వద్ద ఈయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొట్టడం తో సాబ్జీ కన్నుమూశారు. ఆదివారం అధికారిక లాంఛనాలతో షేక్ సాబ్జీ అంత్యక్రియలు పూర్తి చేసారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు సాబ్జీకి నివాళులర్పించారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ ఉత్తర్వులు మేరకు అధికారులు ఏర్పట్లు చేసారు. సాబ్జీ కుమార్తె ఆస్రిఫా అమెరికా నుంచి ఆదివారం ఉదయం ఏలూరుకు రావడంతో సాబ్జీ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు ఆశ్రం ఆస్పత్రి నుంచి నేరుగా సాబ్జీ భౌతికకాయాన్ని ఏలూరులోని యూటిఎఫ్ జిల్లా కార్యాలయానికి తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి, అనంతరం ప్రజల సందర్శనార్థం కలెక్టరేట్ ఏదురుగా ఉన్న ఇండోర్ స్టేడియానికి తీసుకెళ్లారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక తన తండ్రిది ప్రమాదం కాదని , హత్యే అని ఆయన కుమారుడు అనుమానాలు వ్యక్తం చేసారు. ఉపాధ్యాయులకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్సీలను టార్గెట్ చేసి అంతమొందించాలని చూస్తున్నారని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కావాలనే రాంగ్ రూట్‌లో వచ్చి.. ఉద్దేశపూర్వకంగానే యాక్సిడెంట్ చేసి సాబ్జీని హత్య చేశారని చెబుతున్నారు. 140 కిలో మీటర్ల వేగంతో వాహనం వచ్చి కారును ఢీకొట్టినట్లు పోలీసులే చెబుతున్నారని..తన తండ్రిది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని ఎవరో కుట్రపూరితంగా పథకం ప్రకారమే చేసి ఉంటారని ఆరోపించారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి బయటికి తీసుకువచ్చాక కూడా రక్తం కారుతోందని.. ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యేనన్నారు. తన తండ్రి ఎమ్మెల్సీ అయినా పోస్టుమార్టం కూడా సక్రమంగా చేయలేదని.. ప్రమాదానికి కారణమైన వారిని తప్పించేలా పోలీసుల విచారణ ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Read Also : Animal Collections : 900 కోట్ల వైపు పరుగులు తీస్తున్న యానిమల్