Site icon HashtagU Telugu

Anna Canteen : అన్నక్యాంటీన్‌లో ఫ్రీ భోజనం..ఎక్కడంటే !

New Rule In Anna Canteen

New Rule In Anna Canteen

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్‌(Anna Canteen)లు పేద ప్రజలకు అన్నం పెట్టే మహత్తరమైన ప్రణాళిక. గతంలో ప్రారంభమైనా, కొంతకాలం స్తబ్దంగా ఉన్న క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం (TDP Govt) తిరిగి ప్రారంభించింది. ముఖ్యంగా ఉండి నియోజకవర్గం పరిధిలోని ఆకివీడు గాంధీ విగ్రహం సెంటర్‌లో అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు (RRR) సూచనతో ప్రారంభించారు. ఈ క్యాంటీన్‌లో ప్రతి రోజు 200 నుంచి 300 మందికి ఉచిత భోజనం అందిస్తున్నారు. పేదలు, కార్మికులు, చిరు వ్యాపారులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

Harish Rao : హరీష్ రావు పిల్లకాకి- సీఎం రేవంత్

ఈ అన్న క్యాంటీన్ నిర్వహణ బాధ్యతను టీడీపీ సీనియర్ నేత గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు తీసుకున్నారు. గత మంగళవారంతో క్యాంటీన్ 9 నెలలు పూర్తయింది. ప్రభుత్వం అధికారికంగా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు స్వయంగా ఖర్చు చేసి ఈ సేవను కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, సత్యనారాయణ రాజు కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా సత్కరించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అవసరమైన ప్రణాళికలను కొనసాగించడమే తన లక్ష్యమని సత్యనారాయణ రాజు పేర్కొన్నారు.

Telangana Ropeways : భువనగిరి కోటపై రోప్‌వే.. మరో నాలుగుచోట్ల కూడా..

స్థానిక ప్రజలు ఈ క్యాంటీన్ వల్ల తమకు రుచికరమైన భోజనం అందుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా హోటళ్లలో భోజనం చేయాల్సి వచ్చేది, అయితే ఇప్పుడు అన్న క్యాంటీన్‌లో స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భోజనం లభిస్తోందని చెబుతున్నారు. ఆస్పత్రులకు వచ్చిన రోగుల కుటుంబాలు, ఇతర ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కూడా ఈ క్యాంటీన్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ఆకివీడులో ఈ క్యాంటీన్ ప్రజల ఆహార అవసరాలను తీర్చడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు.