Godavari River : గోదావరి నదిలో నలుగురు యువకులు గల్లంతు.. గ‌జ ఈత‌గాళ్ల‌తో గాలింపు

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపిలంక గ్రామ సమీపంలో తణుకుకు చెందిన నలుగురు యువకులు గోదావ‌రి న‌దిలో

Published By: HashtagU Telugu Desk
Indians Die In Australia

Drown

కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గోపిలంక గ్రామ సమీపంలో తణుకుకు చెందిన నలుగురు యువకులు గోదావ‌రి న‌దిలో గ‌ల్లంతైయ్యారు. గ‌ల్లంతైన వారు తిరుమల రవితేజ (21), పెండియాల బాలాజీ (21), అనుమకొండ కార్తీక్ (21), ముదన ఫేంద్ర గణేష్ (21గా గుర్తించారు. కోరింగ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్ 10 రోజుల క్రితం పుట్టినరోజు జరుపుకున్నాడు. అందుకు సంబంధించి కార్తీక్‌తో పాటు మరో ఆరుగురు శనివారం ఉదయం గోపిలంక సమీపంలోని గోదావరి నదికి పార్టీ కోసం వచ్చారని తెలిపారు. సాయంత్రం వరకు ఆరుగురు యువకులు నదిలో స్నానం చేయడానికి సాహసించారు. కార్తీక్ నదిలోకి లోతుగా వెళ్లి మునిగిపోయాడ‌ని పోలీసులు తెలిపారు. కార్తీక్ కేకలు విన్న మరో ముగ్గురు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ముగ్గురు కూడా న‌దిలో గ‌ల్లంతైన‌ట్లు పోలీసులు తెలిపారు. న‌లుగురు యువ‌కుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామ‌ని..గ‌జ ఈత‌గాళ్ల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Also Read:  Murder : కాకినాడ‌లో దారుణం.. ప్రియుడితో క‌లిసి ద‌త్త‌త త‌ల్లిన చంపిన కూతురు

  Last Updated: 22 Oct 2023, 08:16 AM IST