గత వైసీపీ ప్రభుత్వంలో(YCP Govt) అధికారం అడ్డుపెట్టుకొని ఆ పార్టీ నేతలు (YCP Leaders) ఇష్టంవచ్చినట్లు ప్రవర్తించిన సంగతి తెలిసిందే. మా సీఎం , మా నేతలు , మా కార్యకర్తలు అన్న విధంగా ఎవరు ప్రశ్నించిన వారిఫై దాడులు చేయడం, హత్యలు చేయడం వంటివి చేసి నానా బీబత్సం సృష్టించారు. ఇక ఇప్పుడు ప్రభుత్వం (NDA Govt) మారడంతో వారికీ చుక్కలు కనిపిస్తున్నాయి. ఐదేళ్ల నేరాలు, ఘోరాలను కూటమి సర్కార్ బయటకు తీస్తూ వారిపై కేసులు నమోదు చేసి దూల తీరుస్తుంది.
ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయగా..తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత పినిపె విశ్వరూప్ (Pinipe Viswarup) కుమారుడు శ్రీకాంత్ (Pinipe Srikanth)ను మదురైలో పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 జూన్ 6న కోనసీమ అల్లర్ల సమయంలో అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ (Volunteer Durgaprasad) హత్య కేసు (Murder Case)లో ఈ అరెస్ట్ జరిగింది. ఈ కేసులో ముందుగా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేశ్ (YCP social media convener Dharmesh)ను అరెస్ట్ చేశారు, తరువాత విచారణలో శ్రీకాంత్ పేరు బయటకు రావడంతో అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్‌ను ఇవాళ కోర్టులో హాజరుపరచనున్నారు.
వైసీపీ మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పేరు వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య కేసులో తెరపైకి వచ్చిన విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ నెల 18న, పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ ధర్మేష్ విచారణ సమయంలో, ఈ హత్యలో శ్రీకాంత్‌కు సంబంధం ఉందని ధర్మేష్ వెల్లడించాడని తెలిసింది. ధర్మేష్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నప్పటికీ, ఈ కేసులో శ్రీకాంత్ పాత్రపై పోలీసులు ఇప్పటివరకు పూర్తి స్పష్టత ఇవ్వలేదు. హత్యకు గురైన దుర్గాప్రసాద్, శ్రీకాంత్‌కు సన్నిహితుడు అని, ఆయన వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొనేవాడని తెలుస్తోంది. ధర్మేష్‌తో పాటు మరికొంత మంది హత్యలో భాగం అయ్యారని, పడవలో దుర్గాప్రసాద్‌ను పిలిచి, తాడుతో గొంతు బిగించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, శ్రీకాంత్ పాత్రపై విచారణ కొనసాగుతోంది, కానీ హత్య కేసులో అతని పాత్రపై స్పష్టత రావాల్సి ఉంది.
Read Also : Waking Benefits: ఉదయం త్వరగా నిద్ర లేస్తే ఎన్ని లాభాలో తెలుసా..?