ఎన్నికలు (Elections) సమీపిస్తున్న తరుణంలో టీడీపీ(TDP) కి షాకుల తగులుతూనే ఉన్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ అందరికి టికెట్స్ ఇవ్వలేకపోయింది. పలు చోట్ల బిజెపి , జనసేన అభ్యర్థులకు టికెట్స్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో టికెట్ రాని నేతలు పార్టీ అధిష్టానం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు కొనసాగిస్తున్నారు. మరికొంతమందికి పార్టీకి రాజీనామా చేసి వైసీపీ లో చేరుతున్నారు. తాజాగా కదిరి మాజీ ఎమ్మెల్యే సైతం టీడీపీ కి రాజీనామా చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా (Former MLA Attar Chand Basha ) కదిరి టికెట్ కోసం ట్రై చేసారు కానీ టికెట్ రాకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు చాంద్ బాషా లేఖ రాశారు. రేపు కదిరిలో సీఎం జగన్ సమక్షంలో చాంద్ బాషా వైసీపీలో చేరనున్నారు.
ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్న నియోజకవర్గంలో టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి పట్టణంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు గాని, బహిరంగ సభకు కానీ కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. తనకు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఎప్పటికీ కృతజ్ఞుడినే అని ఆయన వ్యాఖ్యానించారు. రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని బాషా స్పష్టం చేశారు.
Read Also : Chandrababu : నా మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెడతాను