Site icon HashtagU Telugu

Happy Birthday YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, గవర్నర్

Happy Birthday Ys Jagan Mohan Reddy

Happy Birthday Ys Jagan Mohan Reddy

Happy Birthday YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు ఈ వేడుకలను ఒక పండగల చేస్తున్నారు. వైసీపీ నాయకులు మరియు కార్యకర్తలు జన్మదినం సందర్బంగా కేక్ లను కట్ చేసి తమ ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ ట్వీట్:

రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్, వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ట్వీట్‌లో, “దేవుడు మీకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయుష్షు కలిగించాలని మరియు ప్రజాసేవలో సుదీర్ఘ కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్:

మరోవైపు, వైఎస్ జగన్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. “బర్త్ డే గ్రీటింగ్స్ టూ వైఎస్ జగన్ గారూ” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు పొందాలని ఆకాంక్షించారు. చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, గత ఏడాది కూడా జగన్ పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు, రాష్ట్రంలోని పట్టణాలు, జిల్లాలు, మండల కేంద్రాల్లో వైసీపీ నేతలు జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, వృద్ధులకు, రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. ఇదే కాకుండా, జగన్ కు శుభాకాంక్షలు తెలిపేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హోరెత్తిస్తున్నారు. #HBDYSJagan అనే హ్యాష్‌ట్యాగ్‌తో తెగ పోస్టులు వేస్తూ, ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

ఇక, వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరు రామేశ్వరంలోని శ్రీ హనుమత్ లింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరియు ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఇక, ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ శ్రేణులతో కలిసి దేవినేని అవినాష్ పుట్టినరోజు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా, “ఆటు పోట్లను అవలీలగా ఎదుర్కోగల ‘ధీరుడికి’ జన్మదిన శుభాకాంక్షలు” అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అలాగే, మాజీ మంత్రి రోజా కూడా వైఎస్ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.