Food Poisoning : తిరుప‌తి జిల్లా ఓజిలి గురుకుల పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌నింగ్‌.. 15 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌

తిరుప‌తి జిల్లా ఓజిలిలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజ‌నింగ్ జ‌రిగింది. పాఠ‌శాల‌కు చెందిన సుమారు 15

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 08:45 AM IST

తిరుప‌తి జిల్లా ఓజిలిలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజ‌నింగ్ జ‌రిగింది. పాఠ‌శాల‌కు చెందిన సుమారు 15 మంది విద్యార్థులు గురువారం ఉదయం కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో ఆసుప‌త్రిలో చేరారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ITDA) సహకారంతో ఈ పాఠశాల నడుస్తుంది. బుధవారం హాస్టల్ మెస్‌లో రాత్రి భోజనం చేసిన తర్వాత బాధిత విద్యార్థినులకు లక్షణాలు కనిపించాయని హాస్ట‌ల్ సిబ్బంది తెలిపారు. దీంతో పాఠశాల సిబ్బంది వారిని గురువారం ఉదయం ఓజిలిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం నాటికి మొత్తం 15 మంది విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉండడంతో డిశ్చార్జి అయ్యారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆసుపత్రిలో పడకలు లేకపోవడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. ఒకే బెడ్‌పై ఇద్ద‌రు ముగ్గురు విద్యార్థులు చికిత్స పొందుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ విష‌యంపై తిరుపతి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్‌ యు.శ్రీ హరిని స్పందించేందుకు నిరాక‌రించారు. విద్యార్థుల‌కు ఫుడ్ పాయిజనింగ్‌కు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటనకు దారితీసిన హాస్టల్ మెస్‌లో పరిశుభ్రత, ఆహార నిర్వహణలో లోపాలు ఉన్నాయా అనే విషయాన్ని గుర్తించడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు స‌మాచారం.

Also Read:  Telangana : తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థుల్లో అత్యంత సంప‌న్న అభ్య‌ర్థి ఆయ‌నే..!