Vizag Fishing Harbour : ఉప్పు చేప ఫ్రై ..40 బోట్లను కాల్చేసింది

మద్యం పార్టీ చేసుకున్నారని..మద్యం సేవిస్తూ ఉప్పు చేప ఫ్రై చేసుకున్నారు..ఫ్రై చేసే టైములో ఆ నిప్పురవ్వలు పక్కనే ఉన్న వలపై పడడంతో నిప్పుంటుకుంది

Published By: HashtagU Telugu Desk
Harbour Fire Accident

Harbour Fire Accident

ఆదివారం అర్ధరాత్రి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ (Vizag Fishing Harbour)లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident)చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 40 పైగా మరబోట్లు (Boats) ఖాళీ బూడిదయ్యాయి. మొదట ఒక బోట్‌లో చెలరేగిన మంటలు.. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డ పోలీసులు..కీలక సీసీ ఫుటేజ్ ను విడుదల చేసారు.

ఈ సీసీ ఫుటేజ్ వీడియోలో ఇద్దరు వ్యక్తులు హడావుడిగా హార్బర్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపించింది. ఈ నెల 9న రాత్రి 10.49 నిమిషాలకు ఇద్దరు వ్యక్తులు హడావుడిగా బయటకు రాగా.. 10:50 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే బోటు లో మద్యం పార్టీ చేసుకున్నారని..మద్యం పార్టీ చేసుకున్నారని..మద్యం సేవిస్తూ ఉప్పు చేప ఫ్రై చేసుకున్నారు..ఫ్రై చేసే టైములో ఆ నిప్పురవ్వలు పక్కనే ఉన్న వలపై పడడంతో నిప్పుంటుకుంది. ఆలా బొట్లు కాలిపోయినట్లు పోలీసులు చెపుతున్నారు. కొద్దిరోజుల క్రితం అదేబోటులో పనిచేసిన నాని మామ సత్యం.. మద్యం మత్తులో మంచింగ్‌ కోసం ఉప్పు చేప ఫ్రై చేశాడు. దీంతో మంటలు చెలరేగినట్లు పోలీసులు తేల్చారు. ప్రస్తుతం 8 మంది నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటే..ఈ ఘటనపై యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పై మొదట ఎన్నో ఆరోపణలు వచ్చాయి. నానీ అతని స్నేహితులు మందు పార్టీ చేసుకుంటున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందని.. తర్వాత ఆ ప్రమాదానికి సంబంధించిన వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై లోకల్ బాయ్ నాని స్పందించారు.. తాను ఏ తప్పు చేయలేదని, నాకు అన్నం పెట్టే గంగమ్మ తల్లి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. ప్రమాదం జరిగిన రోజు తాను ఓ హూటల్లో ఉన్నానని, దానికి సంబంధించిన సీసి టీవీ ఫుటేజ్ పోలీసుల వద్ద ఉందని అన్నారు. ప్రమాదం జరిగిందని తెలియగానే వెంటనే అక్కడికి వెళ్లి వీడియో తీశానని.. మా బాధల గురించి చెప్పడానికే ఆ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసినట్లు తెలిపాడు.

Read Also : Mandava Venkateswara Rao : నిజామాబాద్ లో బీఆర్ఎస్‌కు భారీ షాక్..కాంగ్రెస్ లోకి మాజీమంత్రి

  Last Updated: 25 Nov 2023, 11:12 AM IST