Site icon HashtagU Telugu

Jagananna Suraksha : ప్రజల వద్దకు పాలన సీఎం జగన్‌ లక్ష్యం.. విజ‌య‌వంతంగా జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మం

Jagananna Suraksha

Jagananna Suraksha

ప్రజలకు ఏదైనా కష్టం వస్తే, సమస్య ఉంటే ప్రభుత్వ అధికారులను సంప్రదించడం, వారిని ప్రశ్నించడం సాధారణంగా అందరూ చూస్తుంటారు. కానీ దేశంలోనే మొట్టమొదటిసారి.. ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి  (CM Jagan mohan Reddy)ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే ‘జగనన్న సురక్ష’ (Jagananna Suraksha)  కార్యక్రమం. జులై 1వ తేదీ నుంచి దాదాపు 30 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరగనుంది. దీని ప్రధాన ఉద్దేశం.. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం. దీంతోపాటు ప్రజలకు అర్హత ఉండి సాంకేతిక కారణాలతో వారికి సంక్షేమ పథకాలు దక్కకుండా ఉంటే.. ఈ సురక్ష కార్యక్రమం కింద వాటిని పరిష్కరించి.. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందాలన్నది అందించ‌డం ల‌క్ష్యం. ఇక ఈ కార్యక్రమం అమలుకు క్షేత్ర స్థాయిలో పరిస్ధితులు ఏ విధంగా ఉన్నాయి? వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు? ప్రజల నుంచి స్పందన వస్తే.. సీఎం జగన్‌ గ్రాఫ్‌ ఏ మేరకు పెరుగుతుంది అన్న విషయాలపై ప్రత్యేక కథనం.

ఏపీ వ్యాప్తంగా శనివారం నుంచి ప్రారంభమైన జగనన్న సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన ల‌భిస్తుంది. అనేక మంది తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు సచివాలయానికి వస్తున్నారు. దీంతోపాటు.. అవసరమైన సర్టిఫికేట్లను ఉచితంగానే పొందుతూ.. తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికేట్లు చివరన జగనన్న సురక్ష కార్యక్రమం పేరుతో స్టిక్కర్లు కూడా అధికారులు అంటిస్తున్నారు. మరోవైపు.. గుంటూరు నగరంలోని తూర్పు పరిధిలో శనివారం జరిగిన సురక్ష క్యాంపులో తొమ్మిదవ డివిజన్‌ కార్పొరేటర్‌ ఎల్లావుల అశోక్‌ పాల్గొన్నారు. వారి డివిజన్‌లోని ప్రజలకు సర్టిఫికేట్లను పంపిణీ చేయడం జ‌రిగింది. తాజాగా సురక్ష కార్యక్రమం విజయంలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కీల‌క భూమిక పోషిస్తున్నారు.

Jagananna Suraksha

తొలి రోజు 175 నియోజకవర్గాల్లో 1,305 క్యాంపులు ..

తొలిరోజు క్యాంపుల (జూలై 1వ తేదీన) ఏర్పాటులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మండలానికి రెండు చొప్పున 1,305 సచివాలయాల పరిధిలో ‘జగనన్న సురక్ష’ క్యాంపులు విజయవంతంగా నిర్వహించి లబ్ధిదారులకు అవసరమైన దృువపత్రాలు, ప్రభుత్వ సేవలను అక్కడికక్కడే అందించారు. దీనికి సంబంధించి ఆయా సచివాలయాల పరిధిలోని వాలంటీర్లు జూన్‌ 24వ తేదీనే ఇంటింటికీ వెళ్లి క్యాంపుల సమాచారాన్ని తెలియజేయడంతో పాటు ఆయా కుటుంబాల నుంచి వ్యక్తిగత వినతులను సేకరించి జగనన్న సురక్ష యాప్ లో నమోదు చేశారు. రద్దీగా ఉన్న జగనన్న సురక్ష క్యాంపుల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా వారి భోజన, తాగునీరు సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది.

అర్హులైన ప్ర‌తిఒక్క‌రికి ప్ర‌భుత్వ ప‌థ‌కాలు : మంత్రి మేరుగ నాగార్జున

సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను ఇప్పటి వరకు 99 శాతం మంది అర్హులందరికి అందజేసి.. అర్హత ఉండి సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1 శాతం లబ్ధిదారులను కూడా కవర్ చేస్తూ 100 శాతం సంక్షేమం అందిచాలనే దిశగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సందర్బంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి రోజు క్యాంపుల నిర్వహణ తీరును వివరించారు. చిన్నచిన్న సాంకేతిక కారణాల వల్ల పథకాలు అందని వారు ఎవరైనా ఉంటే.. వారికి లబ్ది చేకూర్చడం, ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లు, వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మంను ప్రారంభించినట్లు మంత్రి మేరుగ తెలిపారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో దాదాపు 2.16లక్షల మంది వాలంటీర్లు, 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది, మండల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొంటున్నారని చెప్పారు.

Chris Gayle: భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్ పై క్రిస్ గేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఏమన్నాడంటే..?