Visakhapatnam : విశాఖపట్నంలోని పారవాడ ప్రాంతంలో ఉన్న ఈస్టిండియా పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (ఈఐపీఎల్) లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం మధ్యాహ్నం సంభవించిన పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగిన పెట్రోల్ ట్యాంకర్‌లో, సోమవారం మధ్యాహ్నం మళ్లీ భారీ మంటలు వచ్చాయి. ముఖ్యంగా ఇథనాల్ ట్యాంకర్ పైభాగంలో మంటలు భారీ స్థాయిలో అంటుకున్నాయి. సంబంధిత అధికారులు మంటల్ని అదుపుచేసినట్టు ప్రకటించినా, ఈరోజు మళ్లీ మంటలు ప్రబలడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు తలెత్తుతున్నాయి. ట్యాంక్‌కు సమీపంలో ఉన్న ఇతర ట్యాంకర్లకు మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో, విజ్ఞతతో పోర్ట్ అధికారులు తక్షణమే స్పందించి ఇండియన్ నేవీ సహాయాన్ని కోరారు.
Read Also: BJP : కామారెడ్డి గడ్డ మీద మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు: రామచందర్ రావు
ప్రస్తుతం నేవీ హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మంటలను అదుపుచేయడానికి నేవీ ప్రత్యేకంగా తగిన చర్యలు తీసుకుంటోంది. మంటల తీవ్రతను అంచనా వేసి, సమీప ప్రాంతాల్లో ప్రజలను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. అగ్నిమాపక శాఖకు చెందిన 10 ఫైర్ ఇంజన్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ప్రమాదం ఏలాగ వచ్చిందంటే, ఆదివారం మధ్యాహ్నం సమయంలో భారీ వర్షాలు కురిసిన సమయంలో 7,500 టన్నుల సామర్థ్యం గల పెట్రోల్ ట్యాంకర్‌పై పిడుగు పడింది. దాంతో ట్యాంకర్ పైకప్పు ధ్వంసమై, మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. మొదటిసారిగా మంటలు అదుపులోకి వచ్చినట్టు అధికారులు ప్రకటించినా, మంగళవారం మళ్లీ మంటలు వ్యాపించడంతో ప్రమాదం మరోసారి ముప్పుగా మారింది.
పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడైనా మంటలు ఇతర కెమికల్ ట్యాంకర్లకు వ్యాపించి పేలుళ్లు సంభవించవచ్చన్న భయం ప్రజల్ని వెంటాడుతోంది. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని అధికారులు హుటాహుటిన తగిన చర్యలు తీసుకుంటున్నారు. వాతావరణ విపత్తులతో సంబంధం కలిగిన ప్రమాదాలపై పరిశ్రమల్లో తగిన జాగ్రత్తలు పాటించాలన్న వాదనలు మరోసారి చర్చకు వస్తున్నాయి. ఈఐపీఎల్‌లో ఎదురైన ఈ ఘటన పరిశ్రమల భద్రతా ప్రమాణాల పట్ల ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రస్తుతం మంటల తీవ్రత తగ్గించేందుకు అధికార యంత్రాంగం మరియు నేవీ సమిష్టిగా పనిచేస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవశ్యకమైతే స్థానాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ సూచనలు జారీ చేశారు. మంటల అదుపులోకి రాగానే దాని మూలకారణాలు, పరిశ్రమలోని భద్రతా లోపాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం.