Site icon HashtagU Telugu

Pawan Kalyans Son: పవన్‌ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. స్కూలులో అగ్ని ప్రమాదం

Mark Shankar Pawanovich Pawan Kalyans Son Singapore Fire Accident

Pawan Kalyans Son: షాకింగ్ ఘటన. సింగపూర్‌లో  ఉంటున్న పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌‌ పవనోవిచ్‌కు గాయాలయ్యాయి. ఇటీవలే స్కూలులో  సంభవించిన అగ్ని ప్రమాదంలో మార్క్‌ శంకర్‌ చేతులు, కాళ్లకు గాయాలైనట్లు తెలిసింది. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో శంకర్‌ అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నేవా సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె 2024 సంవత్సరంలో సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టాను అందుకున్నారు. తన చదువు కోసమే కుమారుడు మార్క్ శంకర్‌తో కలిసి అన్నా లెజ్నేవా సింగపూర్‌లో ఉంటున్నారు. దీంతో అల్లూరి జిల్లా పర్యటన ముగిసిన వెంటనే తన కుమారుడిని చూసేందుకు సింగపూర్‌‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌(Pawan Kalyans Son)  వెళ్లనున్నారు. ఇచ్చినమాట ప్రకారం గిరిజనులను కలిసే వెళ్తానని పవన్‌ అంటున్నారు.

Also Read :Brain Vs Politics : రాజకీయ ఆలోచనలకు బ్రెయిన్‌తో లింక్.. ఆసక్తికర వివరాలు

మార్క్‌ శంకర్‌‌ పవనోవిచ్‌ పేరు గురించి.. 

పవన్ కల్యాణ్ మొదటి భార్య పేరు నందిని. రెండో భార్య పేరు రేణూ దేశాయ్. మూడో భార్య పేరు అన్నా లెజ్నేవా.  అన్నా లెజ్నేవా రష్యా సంతతి మహిళ. రష్యాలో నటిగా ఆమెకు మంచి పేరుంది. లెజ్నేవా క్రైస్తవ మతస్తురాలు. పవన్ కల్యాణ్‌తో పెళ్లి జరిగినప్పటి నుంచి ఆమె భారతీయ సంప్రదాయాలు, ఆచారాలను పాటిస్తున్నారు. ఇక  అన్నా లెజ్నేవా కుమారుడే మార్క్‌ శంకర్‌‌ పవనోవిచ్‌. రోమన్ దేవుడు మార్స్ పేరు నుంచి మార్క్ అనే పదాన్ని తీసుకున్నారు. శంకర్ అనేది చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వర ప్రసాద్‌లోని పదం. పవనోవిచ్ అంటే పవన్ కుమారుడు అని అర్థం. ఈ పదాలన్నీ కలిపి తన కుమారుడికి మార్క్‌ శంకర్‌‌ పవనోవిచ్‌ అని పవన్ కల్యాణ్ నామకరణం చేసుకున్నారు.

Also Read :Dilsukhnagar Bomb Blasts : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు.. నేడే తీర్పు.. ఏమిటీ కేసు ?