Diwali Celebrations 2023 : దీపావళి..ఆ కుటుంబంలో చీకటిని నింపేసింది

దీపావళి సందర్భంగా వేసిన తారాజువ్వలు ఆ పూరి గుడిసెపై పడడంతో క్షణాల్లో ఇల్లు అగ్నికి ఆహుతైంది

  • Written By:
  • Publish Date - November 13, 2023 / 03:26 PM IST

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు (Diwali Celebrations) ఘనంగా జరిగాయి. కుల, మత లకు అతీతంగా ఈ వేడుకలను జరుపుకున్నారు. రాజకీయ నాయకులు , బిజినెస్ ప్రముఖులు, సినీ తారలు ఇలా ప్రతి ఒక్కరు తమ తమ కుటుంబ సభ్యులతో ఎంతో ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం దీపావళి విషాదాన్ని నింపింది. పలువురు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తే..పలువురు బాణా సంచా పేలడం తో మరణించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఏపీలోని డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) కొత్తపేట మండలంలో దీపావళి వేడుకలు ఓ కుటుంబంలో విషాదం నింపింది. కొత్తపేట మండలం ఆవిడి కట్లమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఓ పూరి గుడిసెలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా వేసిన తారాజువ్వలు ఆ పూరి గుడిసెపై పడడంతో క్షణాల్లో ఇల్లు అగ్ని (Fire Accident)కి ఆహుతైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్నపెదపూడి మంగాదేవి అనే మహిళ సజీవదహనం కాగా ఆమె భర్త దుర్గారావుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ దంపతుల ఇద్దరు కుమారులు సైతం మంటల్లో చిక్కుకుని గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో గాయపడిన తండ్రి, ఇద్దరు కుమారులను కొత్తపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇకపోతే పూరిగుడిసెలో పెట్రోల్‌ను నిల్వ చేసి పెట్టుకున్నారని అయితే తారా జువ్వపడగానే మంటలు చెలరేగి క్షణాల్లో ఇల్లు అగ్నికి ఆహుతైనట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Read Also : AP Caste Census : కులగణన కోసం ప్రత్యేక యాప్ ను తీసుకొస్తున్న ఏపీ సర్కార్