Site icon HashtagU Telugu

YS Sunitha Reddy : షర్మిలను జగన్ అందుకే పక్కన పెట్టారు : వైఎస్ సునీత

Ys Sunitha Reddy

Ys Sunitha Reddy

‘‘ఐదేళ్ల క్రితం మా నాయనను దారుణంగా చంపారు. ఇంకా ఇప్పటికీ ఏమీ తేలలేదు. న్యాయం అనేది సకాలంలో జరగాలి. నాలా చాలామంది విషయంలో ఇలాగే జరుగుతోంది.  ఎన్నో కేసులు సుదీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. నేను న్యాయం కోసం ఎవరిని కలవాలన్నా కలుస్తాను. ఈ పార్టీ, ఆ పార్టీ అనేది నాకు వద్దు. బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్, టీడీపీ ఏదైనా సరే.. నాకు న్యాయం చేసేందుకు  ఏ పార్టీ రెడీ అయితే దానితో సంప్రదింపులకు రెడీ’’ అని వైఎస్ సునీత చెప్పారు. ‘‘ఇలాంటి హత్యా రాజకీయాలు చేస్తున్న వారు కనీసం అధికారానికి దూరమైతే .. వారి ప్రభావం తగ్గుతుందనే చిన్న ఆశతో నేను పాలిటిక్స్‌లోకి వస్తున్నాను. అనివార్య పరిస్థితుల్లో రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నాను. అవినాశ్ రెడ్డిని ఓడించేందుకు నావంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తాను’’ అని ఆమె తెలిపారు.

Also Read : Ramayanam Sai Pallavi : బాలీవుడ్ రామాయణం కోసం సాయి పల్లవి షాకింగ్ రెమ్యునరేషన్..!