చంద్రబాబు అరెస్ట్ ఫై సీనియర్ ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు (Film Producer KS Rama Rao ) స్పందించారు. ఏకంగా మోడీకి లేఖ (PM Modi)రాసి వార్తల్లో నిలిచారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి వారం రోజులు కావొస్తుంది..గంటలోనే బయటకు వస్తాడని అనుకుంటే..వారం కావొస్తున్నా ఇంతవరకు బెయిల్ రాలేదు. దీంతో రోజు రోజుకు చంద్రబాబు బయటకు వస్తారా..రారా అనే ఆందోళన ఎక్కువుతుంది.
ఇదిలా ఉంటె చంద్రబాబు (Chandrababu) కు రోజు రోజుకు సంఘీభావం పెరిగిపోతుంది. ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉనన్ చిత్రసీమ వ్యక్తులు సైతం మెల్ల మెల్లగా బయటకు వస్తూ..చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నారు. తాజాగా సీనియర్ ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు..ప్రధానికి మోడీకి లేఖ రాసి వార్తల్లో నిలిచారు.
మీకు తెలియకుండానే వైసీపీ ప్రభుత్వం (YCP Govt) చంద్రబాబును అరెస్ట్ చేయించిందా? అని లేఖలో ప్రశ్నించారు. ఈ లేఖలో ప్రధానికి పలు ప్రశ్నలు సంధించారు. “మీరు జీ20 సదస్సులో హడావుడిగా ఉన్నప్పుడు.. సీఎం జగన్ లండన్‌లో ఉన్నప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది. రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీపై సీమాంధ్ర ప్రజలకు ఎంత ఆగ్రహం ఉందో.. అందుకు సహకరించిన మీ పార్టీపై కూడా అంతే కోపం ఉంది. కానీ 2014 ఎన్నికల్లో మీకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీటు వచ్చిందంటే అది చంద్రబాబు వల్లనే” అని పేర్కొన్నారు.
Read Also : Hair Growth Tips: జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించాల్సిందే?
నేషనల్ ఫ్రంట్‌కు ఎన్టీఆర్ (Nandamuri Taraka Rama Rao) ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయనకు 1996లోనే ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తన రాష్ట్ర ప్రజల బాగు కోసం కాదనుకున్న వ్యక్తి అన్నారు. రాజకీయాల్లో మీ కంటే సీనియర్ అని తెలిపారు. బీజేపీ కేవలం తొమ్మిది రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. మీరు ఇలాగే కక్షపూరితంగా వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో మరింత నష్టపోవాల్సి వస్తుందని ప్రధానికి హితవు పలికారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో ఇబ్బందులు పెడుతుంటే.. తెలుగు ప్రజల హృదయాల్లో రగులుతున్న అగ్నిని మీరు గమనించండి. ఇప్పటికైనా చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయించండి అని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.