RIMS Ongole : ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థుల కొట్లాట

ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థుల్లో కొంతమంది గంజాయి కి అలవాటుపడ్డారు

Published By: HashtagU Telugu Desk
Ongole Rims Medical College

Ongole Rims Medical College

ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీ (Ongole medical college)లో విద్యార్థుల మధ్య (Students Fight) ఘర్షణ చోటుచేసుకుంది. విద్యార్థులు రెండు గ్రూఫుల్లాగా విడిపోయి ఒకరికారు తన్నుకున్నారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే, క్లాస్ రూమ్‌లో ఉన్న కొంత మంది అమ్మాయిలు తమ సెల్ ఫోన్లో వీడియోను చిత్రీకరించారు.

అసలు ఏంజరిగిందంటే..

ఏపీలో గంజాయి విక్రయం రోజు రోజుకు ఎక్కువుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్న విద్యార్థుల్లో కొంతమంది గంజాయి కి అలవాటుపడ్డారు. క్లాస్ రూమ్ కు గంజాయి సేవించి రావడం తో ఇతర విద్యార్థులు ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసారు. దీంతో గంజాయి సేవిస్తున్న వారిపై ప్రిన్సిపల్ సీరియస్ అయ్యి..నాల్గు నెలల పాటు వారిని సస్పెండ్ చేసారు. తాజాగా సదరు విద్యార్థులు హాస్టల్‌కు తిరిగి వచ్చారు. తమపై ప్రిన్సిపల్‌కి ఫిర్యాదు చేశారని క్లాస్ రూములోనే గంజాయ్ బ్యాచ్ కొందరు విద్యార్థులపై పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనలో యశ్వంత్ అనే విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. ప్రిన్సిపల్ ఏడుకొండలు ఈ ఘటనపై విద్యార్థులను విచారిస్తున్నారు.

విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటుంటే, క్లాస్ రూమ్‌లో ఉన్న కొంత మంది అమ్మాయిలు తమ సెల్ ఫోన్లో వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో చక్కర్లు కొడుతుంది.

Read Also :Telangana: ప్రశాంత్ కిషోర్‌ తో కేసీఆర్ రహస్య చర్చలు, గెలుపు లక్ష్యంగా మంతనాలు?

  Last Updated: 22 Nov 2023, 12:22 PM IST