ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ ఫైబర్‌నెట్ కేసులో విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నమోదు చేయబడిన ఈ కేసును కోర్టు తాజాగా పూర్తిగా కొట్టివేసింది. ఈ తీర్పు కేవలం చంద్రబాబుకే కాకుండా, కేసులో నిందితులుగా ఉన్న ఇతర అధికారులందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం – సీఐడీ దర్యాప్తులో ప్రాజెక్టు అమలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక నష్టమూ కలగలేదని నివేదిక రావడమే. ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారింది.
Ozempic: ఓజెంపిక్ అంటే ఏమిటి? భారత్‌లో దీని ధర ఎంతంటే?!
2021 సెప్టెంబర్‌లో ఈ కేసు నమోదైంది. దీనిలో ప్రధాన ఆరోపణలు.. ఫైబర్‌నెట్ ప్రాజెక్టు ఫేజ్-1 టెండర్లలో అక్రమాలు జరిగాయని. టెర్రా సాఫ్ట్‌వేర్ లిమిటెడ్ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా రూ.321 కోట్లకు పైగా ఆయాచిత లాభం చేకూర్చారని, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న వేమూరి హరికృష్ణను టెండర్ కమిటీలో చేర్చి ఆయన కంపెనీకే టెండర్ కట్టబెట్టారని ఆరోపణలు వచ్చాయి. అప్పటి APSFL ఎండీ మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు ఆధారంగా 2023 అక్టోబర్‌లో చంద్రబాబును నిందితుడిగా చేర్చారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక దర్యాప్తు వేగం పుంజుకుంది. సీఐడీ దర్యాప్తు అధికారులు 99 మంది సాక్షులను విచారించినా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అంతేకాక, ఫిర్యాదుదారుడైన మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డి కూడా కేసు మూసివేతకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలపడంతో కేసు కొట్టివేతకు మార్గం సుగమమైంది.
Gurukul Hostel Food : గురుకుల పాఠశాల విద్యార్థులుకు విషంగా మారిన రేవంత్ – హరీశ్ రావు
ఈ తీర్పును టీడీపీ నేతలు ‘న్యాయ విజయం’గా అభివర్ణించారు, ఇది రాజకీయ ప్రతీకారంతో పెట్టిన కేసని తేలిందని పేర్కొన్నారు. గతంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇది చంద్రబాబు నిజాయితీకి నిదర్శనమని అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, వైఎస్సార్సీపీ నాయకులు మాత్రం ఈ తీర్పును అధికార దుర్వినియోగంగా ఆరోపిస్తున్నారు. పునురు గౌతమ్ రెడ్డి వంటి నాయకులు ఈ కేసు మూసివేతను తప్పుపడుతూ, చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయడంలో కింగ్ అని విమర్శించారు. తాము ఈ తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. మొత్తంగా ఆధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేయడం చంద్రబాబుకు రాజకీయంగా, న్యాయపరంగా ఒక పెద్ద ఊరటగా మారింది.
