ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి పేరుతో సముద్రతీర ప్రాంతాల్లో భారీ స్థాయిలో భూసేకరణ చేపడుతోంది. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలోని కరేడు (Karedu ) గ్రామంలో ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్(Indosol Solar Project)కు 8,348 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ, ఈ భూములన్నీ మూడు పంటలు పండే సస్యశ్యామల పొలాలు కావడంతో స్థానిక రైతులు, మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రకటన వెలువడిన జూన్ 21వ తేదీ నుంచి గ్రామంలో నిరసనలు, ఆందోళనలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభమన్ గిల్?
కరేడు ఒక ప్రధానంగా వ్యవసాయం, చేపల వేటపై ఆధారపడ్డ గ్రామం. ఇక్కడ వరిబియ్యం, కొబ్బరి, మిర్చి, కూరగాయలు లాంటి పంటలు సాగు చేయబడుతాయి. వీటిపై ఆధారపడి వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. పైగా సముద్రతీరానికి దగ్గరగా ఉండటం వల్ల మత్స్యకారులకు ఇది అనువైన ప్రాంతం. ఇప్పుడు సోలార్ ప్లాంట్ కోసం భూములను సేకరిస్తే, రైతులు పొలాలను కోల్పోవడం కాక, మత్స్యకారులకు కూడా జీవనాధార మార్గం కోల్పోవాల్సి వస్తుంది. కాంపౌండ్ వాల్‌లతో తమకు సముద్ర ప్రవేశం మూసేస్తారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇతర ప్రజలు, దళితులు, గిరిజనులు కూడా ఈ భూ సేకరణ వల్ల స్థాన చలనం, నివాసాల కోల్పోతానని భయపడుతున్నారు. “మాకు భూముల మీద ఆధారపడి పని చేసే ఉద్యోగాలు లేకుండా పోతాయి, ప్రభుత్వం ఎక్కడైనా మళ్ళీ ఇళ్లు ఇస్తామని చెబుతోంది కానీ మేము మా ఊరు వదలలేం,” అని పేద ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలై 4న నిర్వహించిన గ్రామసభలో గ్రామస్థులు ఏకగ్రీవంగా భూసేకరణకు వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వెల్లడించటం గమనార్హం.
Cucumber: దోసకాయ తిన్న వెంటనే నీళ్లు తాగడం సరైనదా కాదా?
ఇందులోని ఆశ్చర్యకర విషయం ఏమంటే, గతంలో టీడీపీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకించి, అధికారంలోకి వస్తే భూములు వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కరేడులో మరింత ఎక్కువ భూమిని కేటాయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజల నిరసనల నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబునాయుడిని కలిసి మూడు పంటల భూములను మినహాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన ఇవ్వలేదు. దీనితో రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు భూ రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.