Site icon HashtagU Telugu

Fake Profiles Mafia : కంబోడియా ‘సైబర్’ గ్యాంగ్ ఉచ్చులో వందలాది మంది తెలుగువారు ?!

Fake Profiles Mafia

Fake Profiles Mafia

Fake Profiles Mafia : ‘డాటా ఎంట్రీ ఆపరేటర్’ జాబ్స్ పేరుతో కంబోడియాకు చెందిన సైబర్ మాఫియా ముఠాలు గీసిన స్కెచ్‌లో దాదాపు 5వేల మంది భారతీయులు ఇరుక్కున్నారు. ఇలా కంబోడియాకు వెళ్లి మోసపోయిన భారతీయుల్లో వందలాది మంది తెలుగువారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బట్టబయలు కావడంతో భారత్ అలర్ట్ అయింది.  దాదాపు 250 మంది భారతీయులను కంబోడియా నుంచి  రక్షించి ఇటీవల స్వదేశానికి తీసుకొచ్చింది. ఇలా తీసుకొచ్చిన వారిలో ఎంతోమంది తెలుగువారు కూడా ఉన్నారు. ఈవిషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.  స్వదేశానికి తీసుకొచ్చిన భారతీయుల్లో దాదాపు 75 మంది మూడు నెలల క్రితమే ఇండియా నుంచి కంబోడియాకు వెళ్లారని తెలిపింది.

Also Read : Uber Bill Viral : ఉబెర్‌‌తో ఆటో రైడ్.. బిల్లు రూ.7.66 కోట్లు.. ప్రయాణికుడికి షాక్

ఉపాధి అవకాశాల కోసం కంబోడియాకు వెళ్లిన భారతీయులను అక్కడి ముఠాలు బలవంతం చేసి సైబర్ నేరాలకు వాడుకున్నాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. భారతీయ పౌరుల నుంచి అందుతున్న ఫిర్యాదులపై  కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం ఎప్పటికప్పుడు స్పందిస్తోందని  భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ‘‘భారతీయులు టార్గెట్‌గా కంబోడియాలో  మోసపూరిత స్కామ్‌లను నడుపుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని మేం ఆ దేశ అధికారులను కోరాం’’ అని  భారత విదేశాంగ శాఖ తెలిపింది.

We’re now on WhatsApp. Click to Join

కంబోడియాలోని సైబర్ మాఫియా ముఠాలు రిక్రూట్ చేసుకున్న దాదాపు  5,000 మంది భారతీయులను భారతీయులపైకే ప్రయోగించే వారని తెలుస్తోంది. రిక్రూట్ చేసుకున్న భారతీయుల ద్వారా ఫేక్ సోషల్ మీడియా ప్రొఫైల్‌లను(Fake Profiles Mafia) తయారు చేయించేవారని వెల్లడైంది. వాటి ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు, ముసలివారు, నిరక్షరాస్యులను టార్గెట్‌గా చేసుకొని సైబర్  మోసాలకు పాల్పడే వారని తేలింది. కంబోడియాకు చెందిన ఓ సైబర్ ముఠా  గత ఏడాది చివర్లో ఒక సీనియర్ భారత ప్రభుత్వ ఉద్యోగిని రూ. 67 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టింది. సదరు ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  కంబోడియా కేంద్రంగా సాగుతున్న సైబర్ మాఫియా రాకెట్ వ్యవహారం వెలుగుచూసింది. ఒడిశాలోని రూర్కెలా పోలీసులు గతేడాది డిసెంబర్ 30న ఈ  సైబర్ మాఫియా వ్యవహారాన్ని ఛేదించారు. స్థానిక వ్యక్తులను కంబోడియాకు తరలించి సైబర్ నేరాలు చేయిస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేశారు.

Also Read :PM Modi : కాంగ్రెస్ వల్లే మన ద్వీపం లంక పాలైంది.. ప్రధాని మోడీ సంచలన ఆరోపణలు