Site icon HashtagU Telugu

Extramarital Affair: టాక్సీ డ్రైవరుతో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తను చంపిన భార్య!

1

1

నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. నిండు నూరేళ్ల కలిసి ఉండాల్సిన జంటలు దారి తప్పి ప్రవర్తిస్తున్నాయి. సోషల్ మీడియా వ్యామోహమో, ఇతరులపై ఆకర్షణనో కానీ కట్టుకున్నవాళ్లను కడతేరుస్తున్నారు. వివాహేత‌ర సంబంధం కారణంగా భ‌ర్త‌ను చంపించేసిన ఘ‌ట‌న విశాఖ‌తోపాటు రాష్ట్రంలోనూ జరిగింది. ఇటీవల విశాఖ‌ప‌ట్నం వన్ టౌన్ పోలీసు స్టేష‌న్‌లో కానిస్టేబుల్ గా ప‌నిచేసే రమేష్ దారుణ హత్యకు గుర‌య్యాడు. తొలుత దీనిని సాధార‌ణ మ‌ర‌ణ‌మే అనుకున్నా.. త‌ర్వాత ఎందుకో అనుమానం వ‌చ్చి.. విచార‌ణ చేప‌ట్ట‌గా అసలు విషయం బయటకు వచ్చింది.

కానిస్టేబుల్ ర‌మేష్ భార్య శివ‌జ్యోతి అలియాస్ శివాని. ఈమెకు ట్యాక్సీ డ్రైవ‌ర్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇది కాస్తా వివాహేత‌ర సెక్స్ సంబంధానికి దారితీసింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య భ‌ర్త ర‌మేష్ అడ్డుగా ఉన్నాడ‌ని భావించిన శివాని.. ఏకంగా త‌న భ‌ర్త హ‌త్య‌కు తానే స్కెచ్ సిద్ధం చేసింది. దీని ప్ర‌కారం.. ప్రియుడు, అతని స్నేహితుడు సహయంతో భర్త ను క‌డ‌తేరేలా చేసింది శివానీ.

దిండుతో ర‌మేష్‌పై ఒత్తిప‌ట్టి ఊపిరి ఆడ‌కుండా చేసి హత్య చేశారు. అయితే.. అనుమానం రాకుండా.. ర‌మేష్‌కు గుండెనొప్పి గా చిత్రకరించింది భార్య శివ జ్యోతి. ఈ క్ర‌మంలో ఎవ‌రికీ తెలియ‌కుండా.. గుట్టుచప్పుడు కాకుండా.. అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేయించింది. అయితే.. ఈ విష‌యం స్టేష‌న్ కానిస్టేబుళ్ల‌కు తెలిసి.. నివాళుల‌ర్పించేందుకు వ‌చ్చారు. అయితే..  మరణంపై అనుమానాలు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో శివానీ చేసిన తప్పు బయట పడింది. ప్రస్తుతం ఈ ఘటన ఏపీలో సంచలనంగా మారింది.

మరోవైపు కానిస్టేబుల్ రమేష్‌ హత్యకు సంబంధించిన వీడియో పలు మీడియా ఛానళ్లకు లభించాయి. మద్యంతో పాటు తలకాయ కూర వండి రమేష్‌తో పాటు భార్య శివాని ముచ్చటిస్తున్న దృశ్యాలు వీడియో కనిపించాయి. తన గొప్పతనం చెప్పాలంటూ భార్య శివాని అడుగగా.. దానిపై రమేష్ మాట్లాడుతుండగా వీడియో చిత్రీకరించినట్లు ఉంది. ‘‘నా వైఫే.. నా లైఫ్. నా భార్య చాలా ధైర్యవంతురాలు అంటూ భర్త మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురి చేత కంటతడి పెట్టిస్తున్నాయి.

Also Read: Ananya Panday: పింక్ బికినీలో సెగలు రేపుతున్న అనన్య, బోల్డ్ స్టిల్స్ లో భలేగుంది!